టాలీవుడ్ ని ఊపేసిన ఆచార్య దేవా .. ఏమంటివి ఏమంటివి డైలాగ్

Dabbeda Mohan Babu
దాన వీర సుర క‌ర్ణ సినిమా లో దుర్యోధన ని పాత్ర ను సినియ‌ర్ ఎన్టీఆర్ పోషించారు. ఈ సినిమా లో ఈయ‌న చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు కూడా టాలీవుడ్ ను ఊపెస్తు ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ డైలాగ్ చెప్పిన వారే ఆర్టీస్ట్ లుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ లో గుర్తిస్తారు. ఈ డైలాగ్ ను ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది చిన్న స్థాయి హీరోలు అలాగే న‌టీన‌టులు కూడా డైలాగ్ ను చెప్పారు. అంత లా ఫేమ‌స్ అయిన ఈ డైలాగ్ నిడివి పెద్ద గా ఉన్న ఆర్టీస్ట్ లు అల‌వ‌క‌గా ఈ డైలాగ్ ను చెబుతారు. అలాగే ఈ డైలాగ్ కూడా అచ్చ‌మైన తెలుగు భాష లో ఉంటుంది. అందుకే తెలుగు భాష లో ప్రావీణ్యం ఉందా అని ప‌రీక్ష చేయ‌డానికి కూడా ఈ డైలాగ్ ను వాడుతు ఉంటున్నారు.

ఇప్పుడు ఆ డైలాగ్ ను మ‌నం చూద్ధం. ఆచార్య దేవ హహ్హహ్హ  ఏమంటివి ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా  ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది మట్టి కుండలో పుట్టితివికదా  హహ్హహ్హ  నీది ఏ కులము? ఇంద యేల అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ఈయన దే కులము? నా తో చెప్పింతువేమయ్యా మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాడా  ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని ఆ శక్తి చండాలాంగాన యందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని  పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని  మీచే కీర్తింపబడుచున్న ఈ విదురదేవుని కనలేదా సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా  నేడు కులము కులము అను వ్యర్ధవాదములెందుకు?  అని ఎన్టీ రామ‌రావ్ తన దైన శైలీ లో చెప్పాడు. సినిమా విడుద‌ల అయిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఈ డైలాగ్ కు ప్రాధాన్య‌త ఏ మాత్రం కూడా త‌గ్గ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: