మ‌ళ్లి సినిమాల్లోకి జెనీలియా ?

Dabbeda Mohan Babu
టాలీవుడ్ లో అనేక‌ సినిమా లు చేసిన జెనిలీయా త‌న వివాహం త‌ర్వాత సినిమాల‌కు చాలా దూరంగా ఉంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా దాదాపు అన్ని భాష ల సినిమా ల్లో జెనిలీయా మెరిసింది. బాయ్స్ సినిమా తో జెనిలీయా తెలుగు సినిమా ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర అయింది. ఈ సినిమా పెద్ద హిట్ కాక పోయిన జెనిలీయా కు టాలీవుడ్ లో చాలా ఆఫ‌ర్లే వ‌చ్చాయి. ఢీ, బొమ్మ‌రిల్లు వంటి సినిమాల‌తో చాలా ఫేమ‌స్ అయింది. అంతే కాకుండా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో నూ భారీ ఆఫ‌ర్ల‌ను కొట్టేసింది. సిద్దార్థ్, జెనీలియా హీరో హీరోయిన్ లుగా వ‌చ్చిన‌ బొమ్మ‌రిల్లు సినిమాకు గాను జెనీలియా ఫిల్మ్ ఫేర్ అవార్డు ను సొంతం చేసుకుంది. అలాగే అరెంజ్ సినిమాతో ఒక ప్లాప్ ను కూడా ముట క‌ట్టుకుంది. ఈ సినిమా త‌ర్వాత న‌టుడు సిని నిర్మాత రితీష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది. వివాహం త‌ర్వాత జెనీలియా పెద్ద గా సినిమా ల్లో న‌టించ‌లేదు.


కానీ చాలా రోజుల త‌ర్వాత ఇటీవ‌ల మా ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి వ‌చ్చి తెలుగు ప్రేక్ష‌కుల కు క‌నిపించింది. మా ఎన్నిక‌ల్లో త‌న ఓటు వినియోగించు కోవ‌డానికి జెనీలియా ఎకంగా ముంబాయి  నుంచి వ‌చ్చింది. అయితే తాజా గా జెనీలియా క‌నప‌డ‌టంతో అమె మ‌ళ్లి సినిమాలు చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌నే పుకార్లు వ‌స్తున్నాయి. అయితే ఈ పుకార్లు నిజం అవ‌బొతున్న‌ట్టు తెలుస్తోంది. జెనీలియ తెలుగు సినిమా లు చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం. యంగ్ హీరో లు కాక‌పోయిన సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న చేయ‌డానికి అయిన జెనీలియ సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం. తాను సినిమా లు చేయ‌డానికే మా ఎన్నిక‌లకు హాజ‌రు అయ్యార‌ని తెలుస్తోంది. ఈ ఎన్నిక‌ల‌తో డైరెక్ట‌ర్ ల‌కు ప్రొడ్యూస‌ర్ ల‌కు  క‌నిపించాలిని చిన్న ప్ర‌య‌త్నం చేసిందద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు జెనీలియా ను హీరోయిన్ గా పెట్టి సినిమాల ఉ తీస్తారా లేక భూమిక లాగా ప్ర‌ధాన పాత్రల్లో సెల‌క్ట్ చెస్తారా అని తెలియాల్సి ఉంది. అయితే జెనీలియా కేవ‌లం హీరోయిన్ పాత్ర‌లే చేస్తుందా.. లేక ఎలాంటి పాత్ర‌లు అయినా చేయ‌డానికి సిద్ధంగా ఉందా అని తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: