ర‌క్త చ‌రిత్ర : ఫ్యాక్ష‌న్ సినిమాలు తీయ‌డంలో వ‌ర్మ నే టాప్

Dabbeda Mohan Babu
రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ సినిమాలో బెస్ట్ సినిమా ర‌క్త చ‌రిత్ర‌. ఈ సినిమాను ఆంధ్ర ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో గ‌తంలో జ‌రిగిన యధార్థ సంఘ‌ట‌న ల ఆధారంగా ఈ సినిమా ను వ‌ర్మ తెర కెక్కించాడు. ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఇద్ద‌రు పెద్ద నేత‌ల జీవిత కథ‌ల ఆధారంగా వ‌ర్మ ఈ సినిమా కు క‌థ ను రాసుకున్నాడు. అందులో ఒక‌రు ప‌రిటాల ర‌వి. మ‌రొక‌రు మ‌ద్ద‌ల చరువు సూరి. ఈ సినిమా లో ప‌రిటాల ర‌వి పాత్ర ను వివేక్ ఒబెరాయ్ పోషించాడు. అలాగే మ‌ద్ద‌ల చ‌రువు సూరి పాత్ర త‌మిళ హీరో సూర్య పోషించాడు. అయితే రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సినిమా ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ లో చాలా వివాదాలు జ‌రిగియి. ప‌రిటాల ర‌వి ని త‌ప్పుగా చూపుతార‌ని ఆయ‌న అభిమానులు చాలా గొడ‌వలు చేశారు. ఈ గొడ‌వ‌ల తోనే 2010 ఆగ‌స్టు లో విడుద‌ల కావ‌ల్సిన సినిమాను అక్టొబ‌ర్ లో విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమా విష‌యంలో వ‌ర్మ ఏమాత్రం వెన‌క‌డుగు వేయలేదు.

ఈ సినిమా ద్వారా గ‌తంలో ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఫ్యాక్ష‌న్ గొడ‌వలు ఎలా ఉండేవో చాలా మందికి తెలిసింది. ప‌రిటాల ర‌వి, మ‌ద్ద‌ల చరువు సూరి ల మ‌ధ్య న‌డిచిన ఫ్యాక్ష‌న్ వివాదాల‌ను వ‌ర్మ కళ్ల కు క‌ట్టిన‌ట్టు చూపాడు.  ఈ సినిమా లో పాటలు కూడా హైలైట్ గా నిలిచాయి.  అందులో మొద‌టి పాట ర‌క్త సిక్త వ‌ర్ణ‌మైన త‌ర‌త‌రాల ర‌క్త చ‌రిత్ర అనే పాట అప్ప‌ట్లో ఉన్న ప‌గ‌లు ప్ర‌తి కారాల గురించి వివ‌రించింది. అలాగే కత్తుల‌తో సావాసం నెత్తుటితో స‌మాప్తం అనే పాట కూడా అప్ప‌టి ప‌రిస్థుత‌ల గురించి వివ‌రించింది. క‌త్తి ప‌ట్టుకున్న వాడు నెత్తుటి తో నే అంతం అవుతాడు అని ఈ పాట‌లో వివ‌రించారు. అయితే ఈ సినిమా కు కొన‌సాగింపుగా ర‌క్త చరిత్ర‌-2 కూడా తీశారు. ఇందులో ప‌రిటాల ర‌వి హ‌త్య త‌ర్వ‌త మ‌ద్ద‌ల చెరువు సూరి ఎ విధంగా అంచెలు అంచెలు గా ఎదిగాడో చూపించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: