మా ఎన్నికలను వీరు పట్టించుకోలేదే!!

P.Nishanth Kumar
రెండు తెలుగు రాష్ట్రాలలో మా ఎన్నికల పోలింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  గత 15 రోజులుగా ఈ అంశంపై నటీనటుల మధ్య, మా సభ్యుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు నడిచాయి. ముఖ్యంగా మా బిల్డింగ్ పై ఎంతో పెద్ద రగడ చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంతో వాడివేడిగా ఈ ఉదయం మా ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎన్నికల పోలింగ్ ఎంతో రసవత్తరంగా జరిగింది. తొలి రెండు గంటలలోనే 250 ఓట్ల నమోదు రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది.

మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తికావలసిన ఓటింగ్ ను ఓటర్లు ఎక్కువగా రావడంతో ఆ ఎన్నికలని ఒక గంట పాటు ఎన్నికల అధికారి పొడిగించారు. దానికి తగ్గట్లుగానే 600 మంది ఓటర్లు ఈ ఎన్నికలకు హాజరై గతంలో లేనివిధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది అగ్ర కథానాయకులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ అలాగే గిరిబాబు చలపతిరావు బాబు మోహన్ బ్రహ్మానందం వంటి సీనియర్ నటులు రాగా రోజా జయప్రద జెనీలియా అఖిల్ నాని వంటి ఎంతో మంది సినీ తారలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే కొందరు ప్రముఖ తారలు మాత్రం ఓటు వేయడానికి రాలేదు. వారిలో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం.  విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ రానా నాగచైతన్య అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ రవితేజ అనుష్క త్రిష హన్సిక ఇలియానా నిహారిక ఓటు వేసేందుకు హాజరుకాలేదు. వీరి వ్యక్తిగత కారణాలు మరియు వరుస షూటింగ్లతో బిజీగా ఉండడం వల్ల మీరు ఓటు వేసేందుకు రాలేదు అని తెలుస్తుంది. ఏదేమైనా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎన్నికలలో వీరు పాల్గొనకపోవడం కొంత లోటును మాత్రం తెలియజేస్తుంది అని చెప్పవచ్చు. చివరికి ఆరు వందల ఓట్లు పోల్ అవగా ఘనవిజయంతో మంచు విష్ణు విజయం సాధించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: