ఈ ఎన్నికల కన్నా.. మా ఎన్నికలే నయం.. రోజా సంచలన కామెంట్స్!!

P.Nishanth Kumar
నేడు తెలుగు సినీ ఆర్టిస్టులు, ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యం లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ఓటును వినియోగించుకునే కార్యక్రమం జరుగుతుంది.  950 మంది ఓటర్లు కలిగిన మా అసోసియేషన్ ఈ రోజున పోలింగ్ జరుపుతుండగా 11వ తేదీన వాటి ఫలితాలు వెలువడుతున్నాయి.  మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికల అంశం అటు సినీ జనాలలో ఇటు ప్రజలలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ ఎన్నికలలో తనకు ఉన్న ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేయాలని వచ్చిన రోజా మీడియాతో ముచ్చటించారు. ఆమె ఈ సందర్భంగా కొన్ని ఆసక్తి కర విషయాలను వెల్లడించారు. నిన్నటి వరకు జరిగిన విమర్శలు చూసి తను కూడా ఆశ్చర్యానికి గురయ్యాను అని అన్నారు. ఎందుకు అలా తీవ్ర స్థాయి లో విమర్శలు చేస్తున్నారో తెలియలేదని,  సాధారణ ఎన్నికల రేంజ్ లో మా అసోసియేషన్ ఎన్నికలు జరగడం చాలా బాధాకరంగా ఉన్నాయి అని చెప్పింది.

అలాగే రెండు రాజకీయ పార్టీలు వేరు వేరు గా ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసినా వారు కలుసు కొరు కాబట్టి ఆ విమర్శలు అలా కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఈ రోజు తర్వాత రేపు కలిసి పని చేయబోయే వారు ఈ స్థాయిలో విమర్శలు చేసుకోవడం అది వారి పనితీరుపై ఎఫెక్ట్స్ కూడా ఆమె చెప్పారు. ఈ స్థాయిలో విమర్శలు చేసుకోవడానికి వెనక ఎవరో పెద్ద హస్తం ఉన్నారని ఆమె వెల్లడించారు. వారు ముందుకు వచ్చి తన స్టామినాను చూపిస్తే అందరూ వారి గురించి అర్థం చేసుకుంటారని ఆమె అన్నారు. ఇక తాను ఓటు హక్కును వినియోగించుకోవాలని వచ్చానని దానిని వినియోగించుకొని తమ బాధ్యతను పూర్తి చేసుకుంటానని చెప్పారు. ఇప్పటికైనా ఎవరు ఎక్కువగా విమర్శలు చేసుకోకుండా కలిసి మెలిసి ఉంటే మా సినిమా పరిశ్రమకు మంచిదని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను మన ఇబ్బందులు చెప్పుకుంటే వారిని వారు  తీరుస్తానని ఆమె వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: