మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న కాజ‌ల్‌?

Dabbeda Mohan Babu
అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరు గ‌త కొద్ది రోజులుగా వార్త ల‌ల్లో ఎక్కువ గా వినిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో అయితే త‌న అభిమానులు త‌న పెట్టె బోయే పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌ల్లి కాబోతుంది అనే వార్త ఇటు మీడియా ను అటు సోష‌ల్ మీడియా ను ఊపేస్తుంది. అలాగే ఇటీవ‌లే సోష‌ల్ మీడియా లో ఒక పోస్టు పెట్టి త‌న అభిమానుల‌ను అంద‌రినీ ఆలోచింప చేసింది. త్వ‌ర‌లోనే ఒక మంచి గుడ్ న్యూస్ చెబుతాను అంటు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పెట్టింది. దీంతో కాజ‌ల్ త‌ల్లి కాబోతుంద‌న్న వార్త‌లు నిజ‌మేనా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాగ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజ‌ల్ ఆగ‌ర్వాల్ 2020 లో ముంబాయ్ లో ఉన్న ఒక పెద్ద వ్యాపార వేత్త గౌత‌మ్ కిచ్లు ను వివాహం ఆడిన విష‌యం తెలిసిందే. పెళ్లి అయినా కాజ‌ల్ సినిమా లు చేయ‌డం మాత్రం మాన లేదు. కానీ కొన్ని రోజుల నుంచి కాజ‌ల్ ప్రెగ్నెన్పీ తో ఉంద‌న వార్త‌లు టాలీవుడ్ లో చెక్క‌ర్లు కొడుతున్నాయి.


ఈ పుకార్ల పై హీరోయిన్ కాజ‌ల్ కానీ ఆమె స‌న్ని హితులు గానీ ఎ విధంగా స్పంధించ లేదు. అలాగే గ‌త కొద్ది రోజుల గా కాజ‌ల్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ఆమె సోస‌ల్ మీడియా పోస్టు ల ఆధారంగా పుకార్లు  నిజామే కావ‌చ్చు అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే కాజ‌ల్ వ‌రుస గా సినిమా ల‌ను నుంచి త‌ప్పు కుంటుంది అని తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగ‌ర్జున హీరో గా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఘోస్టు అనే సినిమా నుంచి కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌ప్పు కుంద‌ని అన్నారు. మ‌ళ్లి తాజాగా మ‌రో సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పు కుంద‌ని స‌మాచారం. త‌మిళంలో జెఎం శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పుకుంద‌ని తెలుస్తోంది. అయితే కాజ‌ల్ స్థానంలో ఇప్ప‌టికే హ‌న్సిక ను తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే ఈ సినిమాలో రాయ్ ల‌క్ష్మి, రామ్‌కి, సోనియా అగ‌ర్వాల్, స‌త్య‌రాజ్‌, జాన్ కొక్కెన్ తో పాటు మీనా ముఖ్య పాత్ర ల‌ల్లో న‌టిస్తున్నారు. అయితే కాజ‌ల్ వ‌రుస‌గా సినిమా ల నుంచి త‌ప్పు కోవ‌డానికి కార‌ణం ఆమె ప్రెగ్నెన్సీ తో ఉండ‌ట‌మే అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: