మా పోరు : నేనే పోటీలో ఉండాల్సింది - రాజ‌శేఖ‌ర్‌

Dabbeda Mohan Babu
తెలుగు చిత్ర సీమ లో జ‌రుగుతున్న మూవీ ఆర్టీస్ట్ ఎన్నిక‌లు రోజుకో మ‌లుపు తురుగుతున్నాయి. ఈ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుదల అయిన నాటి నుంచి చాలా మార్పులు జ‌రిగాయి. అసలు ఈ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి చాలా మంది పోటీ చేస్తార‌ని అనుకున్నారు. అంతేకాదు కొంత మంది తాను పోటీ చేస్తున్న‌ట్టు అనౌన్స్ కూడా చేశారు. కానీ కొద్ది రోజుల్లో స‌మీక‌ర‌ణాలు చాలా మారాయి. కొంత మంది అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ నుంచి త‌ప్పు కున్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న వారికి మ‌ద్ధ‌త్తు ఇస్తున్నారు. మ‌రి కొంత మంది నామినేష‌న్ వేసి త‌ర్వాత విత్ డ్రా చేసుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు ల మ‌ధ్య అధ్యక్ష ప‌ద‌వి కి తీవ్ర మైన పోటీ ఉంది. అయితే తాజాగా మ‌రోక నటుడు త‌న మ‌న‌స్సు లో ఉన్న మాట బ‌య‌ట‌కు చెప్పాడు.


తాను కూడా మూవీ ఆర్టీస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కి పోటీ లో ఉండేవాడ‌ని అని అన్నారు. అత‌ను ఎవ‌రో కాదు.. హీరో రాజ‌శేఖ‌ర్. తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యు ల‌తో స‌మావేశం నిర్వ‌హించాడు. ఈ స‌మావేశంలో రాజ‌శేఖ‌ర్ త‌న మ‌న‌స్సు లో ఉన్న మాట ను చెప్పాడు. అన్ని కుదిరితే ఇప్ప‌టికి తాను అధ్యక్ష ప‌ద‌వి రేసు లో ఉండేవాన్ని అని అన్నారు. కానీ ప్ర‌కాశ్ రాజ్ పోటీ చేయ‌డంతో తాను స్వ‌తంత్రం గా త‌ప్పు కున్నాన‌ని అన్నారు. మా అధ్య‌క్ష ప‌ద‌వి ప్ర‌కాశ్ రాజ్ అర్షుడు అని చెప్పాడు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ గెలిస్తే మా అసోసియేష‌న్ చాలా అభివృద్ధి చెందుతుంద‌ని ధీమ వ్య క్తం చేశారు. ఇప్పుడు అసోసియేష‌న్ కు భ‌వ‌నం అవ‌స‌రం కాబ‌ట్టి ప్ర‌కాశ్ రాజ్ కు ప‌రిచయాల వల్ల ఫండింగ్ ఎక్కువ వ‌స్తుంద‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ త‌ప్ప‌ని స‌రిగా విజ‌యం సాధిస్తాడ‌ని తెలిపాడు. అలాగే ప్ర‌కాశ్ రాజ్ పోటీ లో లేకుంటే తాను త‌ప్ప‌ని స‌రిగా పోటీ చేసే వాడిని అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: