మా పోరు : రంగంలోకి బాబు గోగినేని

Dabbeda Mohan Babu
మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ కు జ‌రుగుతున్న ఎన్నిక రోజ రోజు కు ర‌స‌వ‌త్తంగా మారుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులే కాకుండా న‌టీ న‌టులు కూడా ఈ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్ తీసుకున్నారు. అంతే కాకుండా ప‌ర‌స్ఫ‌రం వ్య‌క్తి గ‌త దూష‌ణాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే నాగ బాబు మంచు విష్ణు పై వారి ప్యాన‌ల్ పై తీవ్ర మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అలాగే జీవితా రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ లు కూడా ప‌రస్ఫ‌రం తీవ్ర వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. ఇక ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు ల గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తి రోజు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఇరువురు ఎదో ర‌కంగా మీడ‌యా ముందు కు వ‌చ్చి ఒక‌రు మీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ప‌లు టీవీ ఛాన‌ల్స్ ల‌కు ఇంట‌ర్య్వూ లు ఇస్తూ కూడా తీవ్ర మైన ప‌దాల‌తో వ్య‌క్తి గ‌తంగా దూషించు కుంటున్నారు.

అయితే ఈ ఎన్నిక‌ల్లో ఒక అంశం పై తీవ్రం గా చ‌ర్చ జ‌రుగుతుంది. అదే లోక‌ల్ , నాన్ లోక‌ల్. మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌దవి కి ప్ర‌కాశ్ రాజ్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌కాశ్ రాజ్ తెలుగు వాడు కాద‌ని నాన్ లోక‌ల్ అని ప్ర‌త్య‌ర్థులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అస‌లు తెలుగు సిని ప‌రిశ్ర‌మ కు జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో నాన్ తెలుగు వారు ఎలా పోటీ చేస్తార‌ని ప్ర‌కాశ్ రాజ్ ను విమ‌ర్శిస్తున్నారు. అయితే ఈ విమ‌ర్శ‌లను ప్ర‌కాశ్ రాజ్ తో పాటు ఆయ‌న మ‌ద్ధ‌త్తు దారులు తీప్పి కొడుతున్నారు. ఆయ‌న ఈ విమ‌ర్శ‌ల  తీవ్ర‌త త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు తాజాగా ఈ వివాదం లోకి న్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని దిగారు. ప్ర‌కాశ్ రాజ్ పై నాన్ లోకల్ అంటు విమ‌ర్శిస్తున్న వారి పై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నార్త్ ఇండియా నుంచి హీరోయిన్ల ను తీసుకువ‌చ్చి సినిమా లో పెట్టుకున్న‌ప్పుడు లోకాలిటీ గుర్తు కు రాలేదా అని ప్ర‌శ్నించారు. అలాగే గ‌తంలో హీరోయిన్ల ను కొట్టిన వారే టాలీవుడ్ ర‌క్ష‌కుల‌మ‌ని గొప్ప‌లు చెబుతున్నార‌ని అన్నారు. అయితే బాబు గోగినేని చేసిన ఈ వ్యాఖ్య‌లు మంచు మోహ‌న్ బాబు ను, మంచు విష్ణు ను ఉద్ధేశించి అన్నారు. ప‌లువురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: