నాగార్జున బ్యానర్ లో అనుష్క డైరెక్టర్ గా...?

Sahithya
టాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి అనుష్క చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆమె పెద్దగా మీడియా ముందు కూడా కనపడటం లేదు. సోషల్ మీడియాలో కూడా అనుష్క పెద్దగా హడావుడి చేయడం లేదు. ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అందుకే సైలెంట్ గా ఉంటుందని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉందని అంటున్నారు టాలీవుడ్ జనాలు. అయితే అనుష్క విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని వార్తలు బాగా హడావుడి చేస్తున్నాయి. అనుష్క దర్శకురాలిగా మారుతుంది అనే కామెంట్స్ ఎక్కువగా వినబడుతున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అనుష్క సినిమా చేసే అవకాశం ఉందని ఒక యంగ్ హీరోతో ఆమె సినిమా చేయవచ్చని ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రావడమే కాకుండా సినిమాపై కొన్ని కీలక ప్రకటన లు కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె సినిమాలకు దాదాపుగా గుడ్బై చెప్పే అవకాశం ఉంది అని పెళ్లి చేసుకుని వేరే దేశానికి వెళ్లి సెటిల్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
కానీ అనుష్క మాత్రం దర్శకురాలిగా మారే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. తాను సొంతంగా ఒక కథ రాసుకున్నారని ఆ కథతో సినిమా చేయడానికి అనుష్క సిద్ధమవుతున్నారని టాలీవుడ్ లో టాక్ వినపడుతోంది. దీనిపై త్వరలోనే అనుష్క పని కూడా మొదలు పెట్టే అవకాశం ఉండవచ్చని ఒక కొత్త హీరోయిన్ అనుష్క టాలీవుడ్ కి పరిచయం చేయవచ్చు అని టాలీవుడ్ జనాల మాట. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశం ఉండొచ్చని ప్రచారం ఎక్కువగా ఉంది. మరి అనుష్క ఏం చేయబోతుందో ఆమె సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం అనుష్క కథకు సంబంధించి ఒక ప్రముఖ దర్శకుడు సలహాలను కూడా తీసుకుంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: