విడాకుల ముందు చైతూ ఏం చేసాడో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అయిన సమంత, నాగ చైతన్య తాజాగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.శనివారం సాయంత్రం వీరిద్దరూ తమ సోషల్ మీడియాలలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ వార్త కేవలం అక్కినేని అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు సినిమా అభిమానులకు ఎంతో బాధను కలిగించింది.ప్రస్తుతం వీరిద్దరి విడాకుల వ్యవహారం పై ఇండ్రస్టీ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.టాలీవుడ్ లోనే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరి జంట ఇలా ఉన్నట్టుండి విడాకులు తీసుకోవడం ఏంటి?అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? అనేది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.

అయితే అటు చైతూ కానీ, ఇటు సమంత కానీ.. తాము ఇష్టానుసారంగానే విడిపోతున్నట్లు,దీన్ని ఎవరూ తప్పుగా తీసుకోవద్దని..అభిమానులు, సన్నిహితుల సపోర్ట్ తమకు కావాలని పేర్కొన్నారు.ఇక ఇదిలా ఉంటె సమంత దాదాపు నెల రోజుల ముందు నుంచే చైతూ కి దూరం అయినట్లు హింట్స్ ఇస్తూనే వచ్చింది.వీరిద్దరూ ప్రేమలో ఉండగానే ఒకరి పేరు మరొకరి చేతిపై టాటూ వేయించుకున్నారు.చైతూ పేరు సామ్ చేతిపై.. సామ్ పేరు చైతూ చేతిపై మనం చూడొచ్చు.అయితే ఓ వైపు సమంత సోషల్ మీడియాలో అక్కినేని పేరును తొలగించినప్పటి నుంచి రకరకాల పోస్టులు పెడుతూనే ఉంది కానీ చైతూ మాత్రం సైలెంట్ గానే ఉంటూ వచ్చాడు.

అయితే చైతూ కూడా విడాకుల ప్రకటన చేయడానికి ముందే తన చేతిపై ఉన్న టాటూ ను తీసేయించుకున్నాడు.అయితే ఈ విషయాన్ని గుర్తించినా ఏం జరిగిందో అన్న సందేహంతో ఉన్నారు తప్పా..నిజంగా చైతూ విడాకులకు సిద్ధం అవుతున్నారన్న విషయం గుర్తించలేకపోయారు.అయితే చైతూ టాటూ తీసేసిన కొద్ది రోజులుకే విడాకుల ప్రకటన చేసాడు.ఇక ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అనేది అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులకు సైతం నచ్చడం లేదు..దీంతో సోషల్ మీడియాలలో ఈ విషయం పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: