అనుష్క.. మళ్ళీ అలా కనిపిస్తుందట... ?

Satya
అనుష్క. అందగత్తె. పొడగరి, సొగసరి కూడా. ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పదహారేళ్ళు ఇట్టే గడచిపోయాయి. అనుష్క కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఇక ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ని చేసి తనకంటూ స్పెషల్ స్టార్ డమ్ ని సాధించుకుంది.
అనుష్క ఒక టైమ్ లో టాలీవుడ్ ని ఏలింది. ఆమె స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. అయితే ఒకే ఒక సినిమా ఆమె అవకాశాలను కంప్లీట్ గా క్లోజ్ చేసేసింది. ఆ మూవీ  సైజ్ జీరో. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బాగా బరువు పెరిగింది. ఈ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, కానీ ఫట్ అయింది. దాంతో పాటే అనుష్క కెరీర్ కూడా ఇబ్బందులలో పడింది. ఈ మూవీ కొరకు  ఆమె లావు అవడం అయితే అయింది కానీ తిరిగి సన్నబడడం కష్టంగా మారింది.
ఇక ఆమె నిశ్శబ్దం అన్న మూవీ ఈ మధ్యన చేసింది. కానీ అది కూడా ఫ్లాప్ అయింది. దాంతో అనుష్క కొత్తగా ఏ మూవీ చేయడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే అనుష్క అనగానే ఒక అరుంధతి, రుద్రమదేవి వంటి పాత్రలే కళ్ల ముందు కనిపిస్తాయి. దాంతో ఆమెకు పేరు రావడం మాట ఎలా ఉన్నా కెరీర్ లో చేయాల్సిన పాత్రలు చాలానే మిస్ అయింది. ఇపుడు ఆ సంగతి తాపీగా తెలుసుకుని ఈ అమ్మడు తన రూట్ మార్చాలని అనుకుంటోందిట.
నిజానికి అనుష్క నాగార్జున సూపర్ మూవీతో పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ మూవీలో ఆమె రొమాంటిక్ గా కనిపిస్తుంది. ఆ తరువాత విక్రమార్కుడు మూవీలో రవితేజాతో అనుష్క కెమిస్ట్రీ కానీ రొమాన్స్ కానీ ఎవరూ మరచిపోలేరు. అలాంటి అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పుణ్యమాని తన గ్లామర్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది అంటున్నారు. ఇపుడు అనుష్క గ్లామర్ రోల్స్ వేయడానికి మళ్లీ రెడీ అవుతోంది అంటున్నారు. అనుష్క గ్లామర్ రోల్స్ వేస్తే మళ్లీ గతకాలం నాటి వైభవం వస్తుందని కూడా అంటున్నారు. మరి ఆమెకు తగిన క్యారక్టర్లు పడితే కచ్చితంగా అప్పట్లో చూసిన అనుష్కను మళ్ళీ చూడవచ్చేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: