అనుష్క శెట్టి న‌వీన్ పొలిశెట్టి సినిమాకు బ్రెక్ ప‌డిందా?

Dabbeda Mohan Babu
టాలివుడ్ అగ్ర హిరోయిన్ ల‌లో అనుష్క శెట్టి ఒక‌రు. బాహుబలి సినిమా వ‌చ్చిన త‌ర్వాత అనుష్క శెట్టి సినిమాల‌లో అంత‌గా క‌నిపించ‌డం లేదు. కేవ‌లం మ‌హిళా ప్రాధాన్య‌త గ‌ల సినిమాల‌ను ఎంచుకుంటు ఉంటుంది. అందులో భాగంగానే భాగ‌మ‌తి, నిశ్శ‌బ్ధం వంటి సినిమాలు చేసింది. భాగ‌మ‌తి మంచి హిట్ అందుకుంది. కానీ నిశ్శ‌బ్ధం కాస్తా నిరుత్స‌హ ప‌రిచింద‌నే చెప్పాలి. ఈ సినిమాల త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా కు స్వీటి ఒప్పుకోలేదు. కానీ అనుష్క కొన్ని సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని వార్తలు వ‌చ్చాయి. కానీ అవ‌న్నీ పుకార్లే న‌ని త‌ర్వాత తెలిసింది.

అలాగే యంగ్ హిరో న‌వీన్ పోలిశెట్టి జాతిర‌త్న‌లు సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. జాతిర‌త్న‌ల కంటే ముందు హిరో న‌వీన్ పోలిశెట్టి తీసిని సినిమా ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా. ఈ సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. తీసిన రెండు సినిమాలు మంచి హిట్ అందుకున్న సినిమాలే. దీని త‌ర్వాత న‌వీన్ పొలిశెట్టితో సినిమాలు చేయ‌డానికి చాలా మంది డైరెక్ట‌ర్లు ముందుకు వ‌చ్చినా న‌వీన్ మాత్రం ఆచి తూచి క‌థ ల‌ను ఎంచుకుంటున్నాడు. హిరో న‌వీన్ పోలిశెట్టి ప్ర‌తి సినిమా మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడ‌నే విష‌యం తెలిసిందే.

అయితే అనుష్క శెట్టి హిరో న‌వీన్ పోలిశెట్టి కాంబినేష‌న్‌లో ఒక సినిమా వ‌స్తుంద‌న్న వార్తుల ఎక్కువ‌గానే వ‌చ్చాయి. వీరు యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో సినిమా చేయ‌డానికి ఇరువురు ఒప్పుకున్నార‌ట‌. క‌థను కూడా వీరు విని ఒకే కూడా చెప్పార‌ట. టైటిల్ కూడా వీరికి క‌లిసె విధంగా మిస్ శెటి... మిస్ట‌ర్ పొలిశెట్టి అని ఖ‌రారు కూడా చేశార అని స‌మాచారం. అ యితే దీని గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికార‌క ప్ర‌క‌ట‌న  రాలేదు. దీంతో ఈ సినిమా ప‌ట్టాలెక్క క ముందే బ్రెక్ ప‌డిందా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. కొంత మంది అయితే ఈ ప్రాజెక్టు ర‌ద్దు అయింద‌ని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమా గురించి అప్ డెట్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: