చంద్ర‌ముఖి సీక్వెల్ లో అనుష్క శెట్టి?

Dabbeda Mohan Babu
రజిని కాంత్ హిరో గా 2005 లో వ‌చ్చినా చంద్ర‌ముఖి సినిమా చూసే ఉంటారు. ఈ సినిమా అప్ప‌ట్లో పెద్ద హిటే కొట్టింది. ఈ సినిమాలో జ్యోతిక‌, న‌య‌న‌తార న‌టించారు. జ్యోతిక కు ద‌య్యం ప‌డుతుంది. ఆ ద‌య్యాన్ని వద‌లించ‌డానికి ర‌జిని కాంత్ చేసే ప్ర‌య‌త్న మే ఈ సినిమా. అప్ప‌ట్లో చిన్న పిల్లలు ఈ సినిమా చూడాలంటే బ‌య‌ప‌డేవారు. పేద్ద‌లు కూడా ఒట‌రిగా చూడాటానికి ధైర్యం చేసే వారు కాదు. అంతలా ఈ సినిమా ఉండేది. ఈ సినిమా త‌ర్వాత న‌య‌న తార కు మంచి అవ‌కాశ‌లే వ‌చ్చాయి. అయితే ముందుగా ఈ సినిమాను మ‌ళ‌యాళంలో మ‌ణిచిత్ర‌తాయు గా తీశారు. త‌ర్వాత దీన్ని చంద్ర‌ముఖిగా తెలుగులోకి పి. వాసు తెర‌కెక్కించాడు.

ఇదిలా ఉండ‌గా తాజా గా టాలివుడ్ టాప్ హిరోయిన్ అనుష్క శెట్టి తెలుగు, త‌మిళ భాషాల్లో రూపొందుకుంటున్న ఒక సినిమా కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి న‌ట్టు స‌మాచారం. అది కూడా సిక్వెల్ అని తెలుస్తుంది. అది 2005లో ర‌జ‌ని కాంత్ హిరోగా వ‌చ్చిన‌ చంద్ర‌ముఖి  సినిమా కు సిక్వెల్ అని తెలుస్తుంది. అనుష్క శెట్టి ఇప్ప‌టికే కథ ను కూడా విన్నార‌ట. క‌థ బాగా న‌చ్చే స‌రికి ఓకే కూడా చెప్పిన‌ట్టు  స‌మాచారం.  అయితే ఈ సినిమాలో ర‌జిని కాంత్ ఉండ‌ర‌ని తెలుస్తుంది. ర‌జిని కాంత్ స్థానంలో హిరో రాఘ‌వా లారెన్సు న‌టించ నున్నార‌ని తెలుస్తుంది. ఈ సినిమా కూడా డైరెక్ట‌ర్ పి. వాసు తెక కెక్కిస్తున్నాడ‌ని సినీ ప‌రిశ్ర‌మ‌లో గుస గుస లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చంద్ర ముఖి పాత్ర‌ను అనుష్క శెట్టినే పోషిస్తున్న‌ర‌ట‌. ఈ సినిమాలో కీల‌క పాత్ర అనుష్క శెట్టి  దేన‌ని వినిపిస్తుంది. అయితే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు తీసిన అనుష్క శెట్టి కి ఈ సినిమా క‌థ బాగా న‌చ్చింద‌ట. అందుకు గాను వెంట‌నే ఓకే చెప్పింద‌ని టాక్‌


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: