ఏఎన్నార్ మెచ్చుకున్న చంద్రబోస్ పాట!

RATNA KISHORE

కొన్ని మాత్ర‌మే ప్ర‌తిభ‌ను నిరూపించే క్ర‌మానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. మంచి పాట, మంచి సాహిత్యం ఎన్ని సార్లు వింటే ఆ రోజు ఆ రాత్రి లేదా ఆ ఉద‌యం ఆనందాల‌కు నిల‌యం అవుతుంది. అవును! మంచి సాహిత్యం ఆనందాన్నే కాదు జీవితానికో గొప్ప భ‌రోసా ఇచ్చి ని రాశ‌ల‌కు, నీళ్లు నిండిన క‌ళ్ల‌లో నిరాశ‌ల‌కు సెల‌వు ఇచ్చి వెళ్తాయి. అవును! మంచి సాహిత్యం వింటే జీవితానికో జ్ఞాపకం దొరుకుతుంది. జ్ఞాప‌కాల్లో అదే స్థిర‌మ‌యి ఉంటుంది. అలాంటి పాట ప్రార్థ‌నా గీతం అయితే ఓ క‌వికి గౌర‌వం ద‌క్కుతుంది. ఓ క‌విని ఉన్న‌త స్థానానికి చే రుకునేలా చేస్తుంది. చంద్ర‌బోస్ రాసిన పాట‌ల్లో మంచి పాట ఇది. సాహిత్య విలువ, జీవిత బోధ ఉంటాయి. ఏఎన్నార్ మౌనంగానే ఎది గా రు క‌నుక ఈ పాట కూడా అలానే త‌న‌కు న‌చ్చింది. త‌న‌ను క‌దిలించింది. ఓ అంధుల‌ పాఠ‌శాల ప్ర‌తి రోజూ చేసే ప్రార్థ‌న‌లో ఈ గీతం స్మ‌ర‌ణ‌ కు తూగుతోంది. వెరీగుడ్ .. నీవు బాగా రాశావు అని చెప్ప‌డం చిన్న మాట. ఏఎన్నార్ చెబితే కితాబు..ఓ స‌మూహం చెప్పినంత‌..న‌ట స‌ముద్రం చెప్పినంత అని కూడా అనుకోవ‌చ్చు. భావింపవ‌చ్చు అని రాయాలి.

ఇంజినీరింగు చ‌దువుకున్న కుర్రాడికీ,సాహిత్యానికీ ఏం సంబంధం అంటే న‌వ్వుతాడు చంద్ర‌బోస్. వ‌రంగ‌ల్ నుంచి హైద్రాబాద్ వ‌ర‌కు.. ప్ర యాణించి కొన్ని నేర్చుకున్నాడు కొన్ని వ‌దులుకున్నాడు. ఇంటి ద‌గ్గ‌ర రామాల‌యం పాట నుంచి ఇంకా ఎన్నో.. నేర్చుకున్నాడు..ఎ న్నింటినో వ‌ద్ద‌నుకున్నాడు..వ‌దులుకున్నాడు.. ప‌ల్ల‌వించిన గానాల చెంత కొన్ని మంచి పాట‌లు రాశాడు. ఆయ‌న ఎన్ని పాట లు రాసిన ఒక పాట త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పు తుంద‌ని భావించ‌లేదు. ఊహించ‌లేదు కూడా! ఓ అంధుల పాఠ‌శాల‌కు త‌న పాట ప్రార్థ‌నా గీతం అవుతుంద‌ని, ఇది త‌న జీవితాన్ని మారుస్తుంద‌ని అనుకోలేదు. ఈ పాట ఏ చోట ఏ అంధుడు పాడినా ముం దు త‌మ‌ని తాము కొత్త‌గా తెల్సుకున్నాకే పాడుతుంటారు. తెలుసుకుని తీరాల‌న్న తాప‌త్ర‌యంలో పాడుతారు. ఆ పాట మౌనంగా నే ఎద‌గ‌మ‌ని మొక్క నీకు చె బుతుంది.. ఎదిగిన కొద్దీ ఒద‌గ‌మ‌ని అర్థమందులో ఉంది..అన్న ప‌ల్ల‌వితో వినిపి స్తుంది.
పాట బాగానే రాశాడు చంద్ర‌బోస్ కానీ నాకెందుకో కొన్ని లైన్లు మార్చాలి అని అనిపించింది. శ్రీశ్రీ గారి పాట‌ను త‌ల్చుకున్నాను. అగాధ మౌ జ‌ల‌నిధిలోన ఆణిముత్య‌మున్న‌టులే..శోకాల మాటున దాగి సుఖ‌మ‌నున్న‌దిలే.. ఈ మాట‌లు త‌ల్చుకుని ఇవి ప్రేర‌ణ తీసుకుని మీ రు ఏమ‌యినా రాయండి, అప్పుడే ఈ పాట‌కు ప‌రిపూర్ణ‌త అని చెప్పి పంపారు డైరెక్టరు ఎస్.గోపాల‌రెడ్డి.. పాటంతా విన్నాక ఎంతో ఆనం దించారు. మార్పులు బాగా కుదిరాయండి అంటూ పొంగిపోయారు. మొన్న‌టి వేళ అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర మానికి వ‌చ్చి చంద్ర‌బోస్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఒక్క పాట జీవితాల‌ను ప్ర‌భావితం చేసింది. జీవితాల‌కు వెలుగు రేఖ‌లు ప్ర‌సా దించి కొన్ని ఆత్మ‌హ‌త్య‌ల‌ను నిలు వ‌రించింది. గోపాల రెడ్డి గారికి ఈ పాట ఓ ప్ర‌త్యేక‌త‌ను తీసుకువ‌చ్చింది. చిత్ర‌మ్మ పాడుతుంటే ఎన్నో సార్లు విన్నాను. ఆనందించాను అని అంటారు ఆయ‌న‌.
ఈ పాట విని మ‌రో గొప్ప నటుడు పొంగిపోయారు. ఆయ‌న‌కు వేటూరి తెలుసు. దాశ‌ర‌థి, కృష్ణ శాస్త్రి లాంటి పెద్ద  పెద్ద క‌వులు తెలుసు. సి నారే స్నేహితుడు. ర‌మ‌ణ (ముళ్ల‌పూడి వెంక‌ట ర‌మ‌ణ - క‌థకులు ) ఆయ‌న ఆత్మ బం ధువు..బాపు ఆయ‌న నుదిటి రేఖ అలాంటి ఏఎ న్నార్ కు ఈ పాట ఎంత‌గానో న‌చ్చింది. అవును త‌లిస్తే అడుగుల వెంట గుడి క‌ట్టే సంద‌ర్భాలు..స్వ‌ర్గాలే త‌ల‌వొంచే సంద‌ర్భాలు జీవితా న  ఉంటాయి.త‌రించే సంద‌ర్భాల‌కు, త‌లవొంచే లోకాల‌కు మ‌నం ఎన్న‌డూ అధిప‌తిగా ఉండాలి. ఆధిక్యం అంటే ఇదే! నీ అడుగుల్లో గుడి క‌ట్టి స్వ‌ర్గాలే త‌రియించ‌నీ, నీ సంక‌ల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అని చెప్పారీ మాట ఆ పాట‌లో!

జీవిత కాల మ‌జిలీలో ఏఎన్నార్ ఎన్నో పాట‌లు విన్నారు. ఎన్నో పాట‌ల‌కు అభిన‌యించారు. ఎంద‌రో ర‌చ‌యిత‌ల‌తో ప‌నిచేసి ఆనందించా రు. కృష్ణా తీరం నుంచి వ‌చ్చిన ఏఎన్నార్ కు పాట సాహిత్యం ఎంత బాగా అర్థం అవు తుందో వాటి నేప‌థ్యం కూడా అంతే బాగా వివ‌రించ‌ గ‌ల‌రు. నువ్వు పాట రాశావు నేను విన్నాను..ఈ పాట నీ త‌ల్లిదండ్రుల‌కూ, నీకూ, నీ త‌రువాత తరానికీ పేరు తీసుకు వ‌చ్చే పాట అవు తుంది. నీకు అభినంద‌న‌లు చెబు తున్నాను చంద్ర‌బోస్ అని చెప్పారు మౌనంగానే ఎద‌గ‌మ‌ని అన్న పాట విని ఏఎన్నార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: