ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ కి మెగాస్టార్ .... ??

GVK Writings
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ తో కలిసి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. మరొకవైపు ఎన్టీఆర్ నుండి ఎప్పుడో మూడేళ్ళ క్రితం సినిమా రావడంతో ఆయన ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేయనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
కొరటాల శివ తీయనున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల స్టోరీ, స్క్రిప్ట్ విని ఓకే చేసిన ఎన్టీఆర్, త్వరలో దీనిని పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఎంతో గొప్పగా భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తీయనున్నట్లు టాక్. మరొకవైపు ఈ మూవీలోని తన పాత్ర కోసం ఇప్పటికే డిఫరెంట్ గా మేకోవర్ ని స్టార్ట్ చేసిన ఎన్టీఆర్, ఎట్టిపరిస్థితుల్లో ఇది భారీ సక్సెస్ అయ్యేలా అన్ని విధాలా కష్టపడేందుకు సిద్ధం అవుతున్నారట. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనున్నారని, అలానే రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుందని కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అయితే ఈ వార్తలపై అధికారికంగా మేకర్స్ నుండి న్యూస్ రావాల్సి ఉంది. ఇక లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో ఈ మూవీ అధికారిక పూజా కార్యక్రమాలు జరగనుండగా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుక కి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నట్లు టాక్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ ఆచార్య మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: