ఆగండి, ఆగండి ... ఆయన్ని కాస్త ఊపిరి తీసుకోనివ్వండయ్యా .... ??

GVK Writings
హీరో ప్రభాస్ తో రాజమౌళి తీసిన బాహుబలి మూవీస్ రెండూ కూడా మన దేశంతో పాటు విదేశాల్లో కూడా భారీ స్థాయిలో కలెక్షన్ ని సొంతం చేసుకుని తెలుగు సినిమా స్టామినాని హాలీవుడ్ వారికి కూడా తెలిసేలా చేసాయి. అనుష్క శెట్టి, తమన్నా భాటియా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ ఈ సినిమాలని ఎంతో భారీ ఖర్చుతో నిర్మించాయి. అయితే వీటి తరువాత సాహో మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దానితో యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు .
ఇక ప్రస్తుతం ప్రభాస్ ఖాతాలో మొత్తం నాలుగు సినిమాలు ఉండగా అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్ సినిమా ఇటీవల పూర్తి కాగా మరొక మూడు సినిమాలైన సలార్, ఆదిపురుష్, ప్రాజక్ట్ కె వేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అయితే వీటిలో భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న సలార్ ని ప్రశాంత్ నీల్, అలానే భారీ మైథలాజికల్ మూవీ గా భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఆదిపురుష్ ని ఓం రౌత్, ఇక సైన్స్ ఫిక్షన్ జానర్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ప్రాజక్ట్ కె ని నాగ అశ్విన్ ఎంతో గ్రాండ్ గా తీస్తున్నారు. ఈ విధంగా వరుసగా ఒకదానిని మించేలా మరొకటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ కొనసాగుతున్న ప్రభాస్ ఇటీవల ఎంతో తీరిక లేకుండా గడుపుతున్నట్లు టాక్.
వాస్తవానికి మధ్యలో ఏడాదికి పైగా కరోనా వలన లాక్ డౌన్ సమస్యలు రావడంతో ఈ సినిమాలన్నీ వాయిదా పడ్డాయని, అందువల్లనే ఆయన అన్ని సినిమాలు కొద్దిపాటి గ్యాప్ తో చేయాల్సి వస్తోందని అంటున్నారు. కాగా ఇవి చాలన్నట్టు ఆయనతో తదుపరి సినిమాలు తీసేందుకు ఇప్పటికే మరికొందరు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ దర్శకులు నిత్యం ప్రభాస్ ఇంటి చుట్టూ నిత్యం ప్రదక్షిణాలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఆ విధంగా ఫుల్ బిజీగా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్, ఈ నాలుగు సినిమాల అనంతరం కొద్దిపాటి గ్యాప్ తీసుకోనున్నారని, ఈలోపు కాస్త ఆయనకు ఊపిరి తీసుకునే గ్యాప్ అయినా ఇవ్వండయ్యా అంటూ పలువురు ప్రభాస్ సన్నిహితులు ఆయన ఇంటికి వస్తున్న దర్శకనిర్మాతలని సున్నితంగా కోరుతున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: