వామ్మో .. ఏకంగా ముగ్గురితో రొమాన్స్ చేయనున్న మహేష్ ... ??

GVK Writings
టాలీవుడ్ హీరో మహేష్ తో త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా మది ఫోటోగ్రఫిని అలానే థమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఇక గతంలో మహేష్ తో త్రివిక్రమ్ తీసిన అతడు, ఖలేజా సినిమాల్లో అతడు సూపర్ హిట్ కొట్టగా, ఖలేజా ఘోరంగా ఫ్లాప్ అయింది.
అయితే ఈ సారి అలా కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఈ సినిమా స్క్రిప్ట్ పై ప్రస్తుతం త్రివిక్రమ్ ఎంతో కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు చేయనున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ మూవీలో మహేష్ బాబు రోల్ సూపర్ గా ఉంటుందట.
అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇందులో మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ యాక్ట్ చేయనున్నట్లు టాక్. ఇప్పటికే పూజా కన్ఫర్మ్ కాగా, మరోవైపు సెకండ్ హీరోయిన్ గా కొద్దిరోజులుగా నభ నటేష్ పేరు కూడా వినపడుతోంది. అయితే ఇప్పుడు హఠాత్తుగా మూడవ హీరోయిన్ కూడా ఉంటుందట అనే న్యూస్ బయటకు రావడంతో ఆ పాత్ర ఎవరికి దక్కుతుందో అంటూ చర్చలు చేస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి ఇంతకీ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనికి సంబంధించి అఫీషియల్ గా న్యూస్ బయటకు రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: