యువీ క్రియేషన్స్ వారు ఇది సాధ్యం చేసేనా?

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ నెంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు శరవేగంగా ముందుకు వెళుతుంది ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. ప్రభాస్ స్నేహితులు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయగా ఇందులో ప్రభాస్ కూడా వాటా ఉందని బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ తో కలిసి ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసిన ఈ బ్యానర్ వారు ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ సాధించిన ఈ యువీ క్రియేషన్స్ ముందు ముందు మరింత మందితో సినిమాలు చేయాలని భావిస్తోంది.

శర్వానంద్, గోపీచంద్, సంతోష్ శోభన్, విజయ్ దేవరకొండ,నాగ శౌర్య, నాని వంటి హీరోలతో ఇప్పటివరకు సినిమాలు చేసిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు సరికొత్త కాంబినేషన్ ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమాను అలాగే ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా మరొక సినిమాను చేసే విధంగా వారు ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. మెగాస్టార్ ఇప్పటి వరకు తమ సొంత నిర్మాణ సంస్థ లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చిరంజీవి రీ ఎంట్రీ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఇప్పుడు చేసే మూడు సినిమాలు మాత్రమే వేరే ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాను సొంత ప్రొడక్షన్ లోనే చేయాలనే ఆలోచన చేస్తాడు. అలాంటప్పుడు యు.వి.క్రియేషన్స్ వారు తలపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సినిమా వెంటనే ఓకే అవుతుందా లేదా మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందా అనేది తేలాల్సి ఉంది. రెమ్యునరేషన్ ఇవ్వడంలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ఏమాత్రం వెనుకాడని యు.వ క్రియేషన్స్ సంస్థ ఏ విధంగా చిరంజీవిని పడగొట్టి సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: