ఆ హీరోయిన్ పై కోపంగా వున్న ప్రభాస్..

Purushottham Vinay
పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సౌమ్యుడు అనే మంచి పేరు ఉంది. అందరితో కూడా మంచిగా ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది. అలాంటి వ్యక్తికి కోపం రావడం అంటే చాలా పెద్ద విషయమే. ప్రభాస్ అసలు కోపాన్ని కేవలం సినిమాల్లోనే చూస్తాం కాని నిజ జీవితంలో చూడము అని చాలా మంది కూడా భావిస్తూ ఉంటారు.ఇక అలాంటి ప్రభాస్ కు ఒక హీరోయిన్ మాత్రం బాగా కోపం తెప్పించింది. ఆమె వల్ల సినిమా షూటింగ్ షెడ్యూల్ కూడా చెడి పోవడం జరిగింది. అది కూడా ఫారిన్ షెడ్యూల్ స్పాయిల్ కావడం వల్ల ప్రభాస్ కు బాగా కోపం వచ్చింది.యూనిట్ సభ్యులు ఫారిన్ వెళ్లి అక్కడ ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు.అంతేగాక ఆమె కోసం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.ఇక అలాంటి సమయంలో షూటింగ్ కు అంతరాయం కలిగించేలా ఆమె వ్యవహరించింది అంటూ ప్రభాస్ ఆమె మీద చాలా కోపంగా ఉన్నాడట. ఇక అప్పటి నుండి ఆమెతో సరిగా మాట్లాడక పోవడంతో పాటు ఆమెతో కాంబినేషన్ సన్నివేశాలను చెయ్యడానికి కూడా ప్రభాస్ ఇష్టపడలేదనే వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.

ఇక ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలు ఇంకా లవ్ సన్నివేశాలను కూడా చేసేందుకు ప్రభాస్ చివర్లో నో చెప్పాడట. దాంతో ఆ సీన్స్ ని కొన్నింటిని వేరు వేరుగా షూట్ చేసి చివరకు గ్రాఫిక్స్ లో కలిపినట్లుగా యూనిట్ మెంబెర్స్ గుసగుసలాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.ఇక డార్లింగ్ ప్రభాస్ మాత్రం దాన్ని తీసుకోలేక పోతున్నాడని.. ఆయన హర్ట్ అవ్వడం వల్లే ఆమెను చాలా దూరం పెడుతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెతో భవిష్యత్తులో కూడా మళ్ళీ నటించకపోవచ్చని అంటున్నారు.ఇక ఆ సినిమా ఇంకా అలాగే ఆ హీరోయిన్ ఎవరో ఏంటో అనేది ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది. ఇక ఆ హీరోయిన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా వున్న హీరోయిన్. ఆమె కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం ఇంకా హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది.ఆమెకు వచ్చిన ప్రతి ఆఫర్ ను కూడా అస్సలు వదులుకోకుండా ఓకే చెప్పడం వల్ల ఇతర సినిమాలకు డేట్లు ఇచ్చే విషయమై ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఆమె సినిమాలకు కమిట్ అవ్వడం వల్లే ఆమె ప్రభాస్ సినిమా షెడ్యూల్ కు చేరుకోలేకపోయిందని పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: