బాలయ్య రౌడీయిజం పై క్లారిటీ వచ్చినట్లేనా!!

P.Nishanth Kumar
బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సినిమాకి రౌడీయిజం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని గత కన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమాతో మంచి కం బ్యాక్ చేయాలని భావిస్తున్నాడు. వీరిద్దరి గత సినిమాలు భారీ ఫ్లాప్ కావడంతో ఇద్దరికీ ఈ సినిమా హిట్ తప్పనిసరి అయింది. ముఖ్యంగా బోయపాటి శ్రీను కు ఈ సినిమా హిట్ కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఈ సినిమా తరువాత మరొక మాస్ సినిమా చేయాలని సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని తో చేతులు కలిపాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రా క్రాక్ చిత్రం లాగానే ఇది కూడా భారీ మాస్ మసాలా చిత్రం అని యదార్ధ సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశామని ఈ చిత్ర బృందం తెలిపింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాలయ్య అభిమానులకు ఐ ఫీస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ను ఖరారు చేశారని సోషల్ మీడియాలో వార్తలు రాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఇది నిజమైన వార్త కాదని తేల్చింది.

 ఇది ఒట్టి పుకార్లే అని చెప్పింది. ఈ నేపథ్యంలో రౌడీఇజం అనే టైటిల్ బాలకృష్ణ సినిమాకు కాదని తెలుస్తుంది. మరి క్రాక్ సినిమా టైటిల్ లాగానే దీనికి కూడా మరొక వెరైటీ టైటిల్ పెడతాడా గోపీచంద్ మలినేని చూడాలి. బాలకృష్ణ ఈ సినిమాతో పాటే మరిన్ని సినిమాలు కూడా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశాడు. వరుస దర్శకులతో మంచి మంచి సినిమాలను ప్లాన్ చేశాడు. అనిల్ రావిపూడి పూరి జగన్నాథ్ ల తో ఒకేసారి సినిమాలు చేయాలని భావిస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలి కాలంలో సక్సెస్ రేట్ లో బాగా వెనుకబడిపోయిన బాలకృష్ణ ఈ సినిమాలతో సక్సెస్ ను అందుకునీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: