దిమ్మ తిరిగే షాక్.. రాజమౌళి సినిమా ఆయనతో!!

P.Nishanth Kumar
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా విడుదల కాలేదు. అప్పుడే ఆయన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మా హీరో తో అంటే మా హీరో తో ఆయన సినిమా చేస్తున్నాడు అంటూ కొంతమంది పెద్ద హీరోల అభిమానులు సోషల్ మీడియాలో మాటలు చెప్పుకుంటా ఉండగా రాజమౌళి వారందరికీ షాక్ ఇస్తూ ఇప్పుడు వెరైటీ గా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత
ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది హిట్ ఇచ్చి అందరినీ ఒక్క సారిగా షాక్ కి గురి చేసేశాడు.

రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబు తో అని ప్రభాస్ తో  అని లేదు కోలీవుడ్ హీరోతో అని ఎవరికి తోచిన విధంగా వారు చెప్పారు. ముఖ్యం గా మహేష్ అభిమానులు అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఫిక్స్ అయిపోయారు కూడా. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తరువాత ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం రాజమౌళి కూడా వేరే సినిమాకు ఓకే చెప్పకపోవడం తో వీరిద్దరూ కలిసి పని చేయడం గ్యారంటీ అనుకున్నారు కానీ రాజమౌళి తాజాగా తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ లో చేయాలని భావించాడట. అక్కడ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేయాలనేది రాజమౌళి ఆలోచన. ఈ నేపథ్యంలో రాజమౌళి ఈ విధమైన ఆలోచన చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.


ఇక బాహుబలి సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ స్థాయి మార్చేసిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో కూడా మరో లెవెల్ పైకి ఎక్కే విధంగా ఈ సినిమాను నిర్మించాదని తెలుస్తుంది. ఎన్టీఆర్ ను కొమరం భీమ్ గా రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజు గా ఈ సినిమాలో చూపించబోతున్నాడు జక్కన్న. అయితే ఈ సినిమా విడుదల కొంత అయోమయంలో ఉంది. మొన్నటిదాకా అక్టోబర్ 8 న ఈ చిత్రం విడుదల అన్నారు. ఇప్పుడు ఈ సినిమా వచ్చే సంవత్సరం వేసవి కి రాబోతుంది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళి కి ఎలాంటి పేరు తీసుకు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: