ఎన్టీఆర్ సినిమా కోసం కొరటాల శివ ఆయన్ని రంగంలోకి దించబోతున్నాడా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాటు రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ గా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా జరిగిపోయింది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటు ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాను పూర్తి చేసుకొని , అలాగే కొరటాల శివ 'ఆచార్య' సినిమా పూర్తి చేసుకున్న వెంటనే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ  'ఆచార్య' సినిమా షూటింగ్ పనులు త్వరగా ముగించుకొని ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ దర్శకుడు కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనుండగా , ఇతర భాషల్లోని ఫేమస్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించడం కోసం మరియు సినిమాను చాలా గ్రాండ్ గా చూపించడం కోసం డిఓపి రత్నవేలు ను తన టీం లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు కొరటాల శివ రత్నవేలు తో సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా దర్శకుడు కొరటాల శివ ఇప్పటినుండే ఎన్టీఆర్ సినిమా కోసం ప్రణాళికలు రచిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: