మెగాస్టార్ చిరంజీవినే మెప్పించిన విలన్ ఎవరో తెలుసా ?

VAMSI
సినిమాల్లో హీరోలు ఎలా అయితే కీ రోల్ పోషిస్తారో విలన్ లు కూడా అంతే కీలకం గా ఉంటారు. ముఖ్యంగా అలనాటి చిత్రాల్లో అయితే విలన్ ల పాత్ర హీరోలకు సమానంగా ఉండేది. విలన్ అంటే ఆ టీవి, ఆహార్యం, పవర్ఫుల్ డైలాగులను ఘంబీర్యంగా చెప్పగల సత్తా ఇవన్నీ మెండుగా ఉన్నప్పుడే ఆ నటుడు విలన్ గా ఎక్కువ కాలం రాణించగలరు లేదంటే ఒకటి రెండు సినిమాలకే వెనుతిరగాల్సి ఉంటుంది. హీరోలకు అయితే వరుస ఫెయిల్యూర్ ఎదురైన అవకాశాలు అందటం కష్టమేమీ కాదు కానీ విలన్ గా పాత్రలు ఫెయిల్ అయితే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ లు దొరకడం కాస్త కష్టమే. అయితే అప్పటి తెలుగు చిత్రాల్లో విలన్ గా చక్రం తిప్పిన అతి కొద్ది మంది నటుల్లో చరణ్ రాజ్ ఒకరు. ఈయన అసలు పేరు బ్రహ్మానందం. కానీ సినీ పరిశ్రమకు వచ్చాక చరన్ రాజ్ గా పేరు మార్చుకున్నారు.
"ప్రతిఘటన" సినిమాతో మొదలైన ఆయన తెలుగు సినీ ప్రయాణం, మొదటి సినిమాలో చేసిన విలన్ పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే లేకుండా పోయింది. వరుస సినిమాలలో విలన్ గా చేస్తూవు ప్రేక్షకుల ఆదరణను దక్కించున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్న గోపి చంద్ నాన్న టి కృష్ణ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన  ప్రతిఘటన సినిమాలో చరణ్ రాజ్ కు తొలుత అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ఖాళీ పాత్రలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ప్రతిఘటన మూవీలో చరణ్ రాజ్ నటనకు  మెగాస్టార్ చిరంజీవి లాంటి అద్భుతమైన హీరో మంత్రముగ్దులై తన చిత్రంలో పిలిచి మరి అవకాశం ఇచ్చారంటే చరణ్ రాజ్ నటనా ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలా వరుస సినిమాలతో బిజీ అయిపోయిన చరణ్ రాజ్ విభిన్నమైన పాత్రలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. చరణ్ రాజ్ తెలుగు,  కన్నడ, తమిళ భాషలలో దాదాపు 400 సినిమాలలో నటించారు. ఇప్పుడు కూడా ఎక్కడో అడపా దడపా  చేసుకుంటూ పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: