ప్రియా.. నాగ్ తో నటించిన మొదటి సినిమా..?

Divya
ప్రియా.. ఈమె ఎన్నో సినిమాలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసి, చాలామంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది.. మిర్చి, చిరునవ్వుతో, బాబు బంగారం వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రియా, తన నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. ఇక ఈమె కేవలం వెండి తెరపైనే కాదు బుల్లితెర పైన కూడా మెరిసి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు గా గుర్తింపు పొందింది. ఈ టీవీ లో ప్రసారమైన ప్రియసఖి.. సీరియల్ ప్రియ కు మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకే ప్రియ అంటే బాగా తెలుసు. ఇకపోతే ప్రస్తుతం వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ప్రియా కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే..

ఇందులో మిగతా హౌస్ మెట్స్ తో చాలా చక్కగా కలిసి పోతూ.. అన్ని టాస్క్ లలో చాలా కూల్ గా ఆడుతూ.. మరింత మంది  అభిమానులను పెంచుకుంది. బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ గ్లామర్ క్వీన్ గా ప్రియను కొనియాడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రియా నాగార్జునతో కలిసి దిగిన ఒక పాత ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.. అంతేకాదు ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు కూడా నాగార్జునతో కలిసి నటించిన సన్నివేశాలను కూడా ప్రియ గుర్తు చేసుకుంది.

1998లో జూలై 30 వ తేదీన విడుదలైన చంద్రలేఖ సినిమాలో నాగార్జున హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ భర్త క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ ఈ  సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ప్రియా కు కూడా కృష్ణవంశీ ఈ సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రలేఖ సినిమాలో ప్రియా బంగారి అనే పాత్రలో నటించింది. ఇకపోతే ప్రియా ఈ  ఫోటోను  సోషల్ మీడియాలో షేర్ చేసి.. గత 23 ఏళ్లుగా ఈ అనుభవం నన్ను వెంటాడుతూనే వుంది..ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు వచ్చేలా చేశాయి థాంక్యూ నాగార్జునగారు ..అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: