విలనిజంలో సరికొత్త పంథా మోహన్ బాబుది...

VAMSI
సినీరంగం ఒక మాయా ప్రపంచం. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఏ స్థానంలో మెరుస్తారో ఎవరూ చెప్పలేరు. దర్శకులుగా వచ్చిన హీరోలుగా మారిన వారు ఉన్నారు. హీరోలుగా వచ్చి విలన్ పాత్రలలో, మరియు నిర్మాతలుగా రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే విలన్ లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు అయిన వారు ఉన్నారు. అలా టాలీవుడ్ లోకి విలన్ గా రంగ ప్రవేశం చేసి హీరోగా ఎదిగి, నిర్మాతగా మారి ఎన్నో చిత్రాలను నిర్మించి, రాజకీయ నాయకుడిగా పాలిటిక్స్ లోకి రంగప్రవేశం చేసి, శ్రీ విద్యానికేతన్ అంటూ విద్యాసంస్థను విజయవంతంగా నిర్వరిస్తున్న కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.
మోహన్ బాబును మట్టిలో మాణిక్యం అంటే సరిగ్గా సరిపోతుంది. ఎలా అయితే బంగారం కరగపెడితే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి అందంగా మార్చుకోగలమో, అలాగే ఏ రూపంలో ఉన్నా దాని విలువ దానిదే. అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి పాత్రను నూటికి నూరుపాళ్లు పండిస్తారు. విలన్ గా వచ్చి హీరోగా ఎదిగిన చాలా తక్కువ మంది నటులలో మోహన్ బాబు ముందుంటారు. ఆయన సినీ జీవితం ఎందరికో ఆదర్శం. విలన్ అంటే కేవలం సీరియస్ గా ఉండటమే కాదు ప్రేక్షకులను నవ్వించడం కూడా అని నిరూపించారు. తన గురువు  దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన "స్వర్గం- నరకం" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మోహన్ బాబు ఇప్పటి వరకు 520 కి పైగా సినిమాలను చేశారు.
అందులో దాదాపు 150 సినిమాల్లో హీరోగా చెయ్యగా మిగిలిన చిత్రాల్లో విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. మోహన్ బాబు విలన్ గా నటించిన సినిమాలలో ఒక ప్రత్యేక శైలితో పాత్రను అద్భుతంగా పండించేవారు. ఎక్కువగా చిరంజీవి సినిమాలలో విలన్ గా నటించి సినిమా విజయాలలో కీలక పాత్ర పోషించాడు. పాత్ర ఏదైనా 100 శాతం కష్టపడగలగల కొద్ది మంది నటులలో మోహన్ బాబు ఒకరు. ఒక విలన్ గా ఎలా ఉండాలో... విలన్ గా కామెడీని పండించే వైఖరి మోహన బాబుకు సొంతం.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: