జపాన్ లో డాన్స్ మహారాణి గా గుర్తింపు పొందిన నటి..!

Divya
సాధారణంగా దక్షిణ భారత దేశంలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు , ఆ తరువాత ఉత్తర భారతదేశంలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరును తెచ్చుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇటీవల మన తెలుగు సినిమాలు ముఖ్యంగా జపాన్ లో బాగా పాపులర్ పొందుతున్నాయి అని చెప్పవచ్చు.. అయితే జపాన్లో ముఖ్యంగా దక్షిణ భారత ఫిలిం ఇండస్ట్రీ బాగా గుర్తింపు పొందడానికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పవచ్చు. ఆయన తమిళ్ లో బాగా పాపులర్ పొందిన ముత్తు సినిమాను తెలుగులో రీమేక్ చేసి అక్కడ విడుదల చేయడం జరిగింది..
ఈ సినిమాతో జపాన్ లో ఒక ప్రభంజనాన్ని సృష్టించి,  కాసుల వర్షం కురిపించాడు. రజనీకాంత్ ఈ  సినిమాలో హీరోగా ,  హీరోయిన్ గా మీనా నటించింది. ఇక ముఖ్యంగా అక్కడ సూపర్ స్టార్ హీరో ..సూపర్ స్టార్ హీరోయిన్ ..అని ఎవరు అని అడిగితే అది కేవలం రజనీకాంత్ , మీనా పేర్లే చెప్తారట.. 1998 అక్టోబర్ లో ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయడంతో అక్కడ విశేష జనాదరణ పొందింది ఈ సినిమా.. అంతేకాదు వీరు స్టెప్పులతో జపాన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు .ఇక అక్కడ  డాన్స్ మహారాజుగా రజనీకాంత్ గుర్తింపు పొందితే, డాన్స్ మహారాణిగా మీనా గుర్తింపు పొందింది..

ఒక షో ద్వారా వెల్లడించిన విషయం ఏమిటంటే , తన ఇల్లు ఒక టూరిస్ట్ ప్లేస్ అట. ఎందుకంటే మీనా అంటే  అభిమానం ఉన్న వారు ఎప్పుడైనా చెన్నైకి వచ్చినప్పుడు, ఆమె ఇంట్లో లేకపోయినా సరే ఆమె ఇంటి ముందు నిలబడి, ఫోటోలు తీసుకొని వెళ్ళి పోతారట.. అంతలా తన పాపులారిటీని పెంపొందించుకుంది మీనా.. ఇక ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్  తన సినిమాలతో మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆ తర్వాత మరి కొంత మంది హీరోలు అక్కడ తమ సినిమాలను రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక ముత్తు సినిమా మీనా కు అంత పేరు తెచ్చిపెట్టింది అని మనం చెప్పకనే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: