మైత్రి మూవీ మేకర్స్ లో రాజమౌళి, ప్రభాస్ సినిమా..?

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'చత్రపతి' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ చేస్తూ 'బాహుబలి' తో జనాల ముందుకు వచ్చారు. ఈ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి కి , ప్రభాస్ కు ఎనలేని గుర్తింపును తీసుకువచ్చింది. 'బాహుబలి' సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి తన తదుపరి సినిమా చేయబోతున్నాడు అనే ఒక వార్త కూడా తెగ వైరల్ అయ్యింది. అయితే ప్రస్తుతం రాజమౌళి, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్ లో ప్రభాస్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న సినిమాలను పూర్తి చేసి రాజమౌళి సినిమా లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాజమౌళి కూడా ఆలోపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమాను పూర్తి చేసి ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: