కూతురి పేరుతో బన్నీ నిర్మాణ సంస్థ...?

Sahithya
ప్రస్తుతం మన తెలుగులో అల్లు అర్జున్ కి డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అల్లు అర్జున్ వచ్చే ఏడాది బాలీవుడ్లో కూడా ఒక సినిమా చేయవచ్చని ఒక రీమేక్ సినిమాను కూడా తెలుగులో చేసే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో టాక్ వినపడుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక మలయాళ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి ఇప్పుడే భార్య స్నేహారెడ్డి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తన భర్త సినిమాల విషయంలో నిర్మాత కూడా తనే ఎక్కువగా జ్యోక్యం చేసుకుంటూ వస్తున్నారని టాక్ ఉంది.
ఇక అల్లు అర్జున్ తన తండ్రి లేదా ఇతర నిర్మాతల  నిర్మాణ సారథ్యంలో ఇక్కడినుంచి సినిమాలు చేయకుండా సొంత నిర్మాణ సంస్థను నిర్మించుకునే ఆలోచనలో ఉన్నాడని టాక్. తమిళ రీమేక్ సినిమాలు తెలుగులో చేసే ఆలోచనలో ఉన్న అల్లు అర్జున్ దానికి నిర్మాతగా వ్యవహరించాలని తన కుమార్తె పేరు నిర్మాణ సంస్థకు పెట్టే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కీలక అడుగు పడే అవకాశం ఉందని దీనికి త్వరలోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తిచేసి అధికారికంగా ప్రకటించవచ్చు అని అంటున్నారు.
ఈ నిర్మాణ సంస్థకు చైర్మన్ గా అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి వ్యవహరించే అవకాశం ఉండవచ్చని కూడా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ తరుణంలో అతను వేస్తున్న అడుగు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది ఏంటి అనేది ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చూస్తుండగా ఈ సినిమాను సంక్రాంతికి లేదా క్రిస్మస్ కు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యే సూచనలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: