మళ్లీ మొదలైన ఆచార్య..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల తో సహా సామాన్య సినీ జనం కూడా ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. అయితే చిరంజీవి మలయాళం సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' కి రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్  పాల్గొనడం మరియు అదే విధంగా రామ్ చరణ్ కూడా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ లో పాల్గొనడం వల్ల ఈ రెండు పాటల షూటింగ్ ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ రెండు పాటలను చిత్రీకరించడం కోసం చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య'  షూటింగ్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ షూటింగ్ జరుగుతునట్లు తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్  పై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఈ పాట మెగా అభిమానులకు కన్నుల పండుగగా ఉండే విధంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఒక వారం పాటు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల తర్వాత రామ్ చరణ్ , పూజ హెగ్డే ల పై మరొక సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో  'ఆచార్య' సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త విడుదల తేదీని మరికొద్ది రోజుల్లో చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారిగా కలిసి నటిస్తున్న పూర్తిస్థాయి సినిమా కావడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఒక పాట జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: