బాలకృష్ణ టైటిల్ తో షారుఖ్ ఖాన్ సినిమా..?

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వెండి తెరపై కనిపించే దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. 'జీరో' సినిమాతో ప్రేక్షకులను అలరించిన షారుక్ ఖాన్ ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు.  మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి 'ప‌ఠాన్' ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ ఒక సినిమాను ప్రారంభించాడు.
 అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పూణే పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో దర్శకుడు తో పాటు నటీనటులు కూడా ఎక్కువ శాతం సౌత్ వారే ఉన్నారు.

ఈ సినిమాలో షారుక్ ఖాన్ కు జంటగా నయనతార , ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇలా షూటింగ్ మొదలు పెట్టడం తోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమాకు లయన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లయన్ అనే సినిమా పేరుతో ఇప్పటికే బాలకృష్ణ ఒక సినిమాను లో హీరోగా నటించి దానిని విడుదల కూడా చేశాడు. కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న అట్లీ , షారుక్ ఖాన్ సినిమాలకు ఇదే పేరును పెట్టబోతున్నారు అని తెలియడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిజంగానే లయన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారో లేదో తెలియాలంటే చిత్రబృందం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేసే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: