బాలయ్య సినిమా టైటిల్ పై స్పందించిన మేకర్స్..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'అఖండ' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోణ విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బాలకృష్ణ ఈ సంవత్సరం 'క్రాక్' సినిమాతో మంచి విజయం అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా ఇది వరకే జరిగిపోయింది. ఈ సినిమాను NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ మధ్య ఈ సినిమాకు రౌడీయిజం అనే ఒక పవర్ఫుల్ టైటిల్ ను చిత్ర బృందం ఫిక్స్ చేశారు చేశారు అంటూ ఒక వార్త హల్చల్ అవుతుంది. అయితే దీనిపై స్పందించిన మేకర్స్ బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాకు రౌడీయిజం అనే టైటిల్ తెగ వైరల్ అవుతుంది, అది నిజం కాదు.

ఇంకా బాలకృష్ణ , గోపీచంద్ సినిమాకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు అంటూ నిర్మాతలు స్పందించారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ సినిమా టైటిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు సినిమా టైటిల్ తో సహా ఇతర విషయాలను కూడా తెలియజేస్తామని వారు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్త దాదాపుగా నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానా ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోయిన్ లకు గోపీచంద్ మలినేని కథ వినిపించడం తో కథ బాగా నచ్చి ఇద్దరు హీరోయిన్లు ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా గోపి చంద్ మలినేని బాలకృష్ణ సినిమా కోసం ఏర్పాటుచేసిన సర్ప్రైజ్  లను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: