ఆర్ ఆర్ ఆర్ ను జక్కన్న అలా డిసైడ్ చేస్తున్నాడా!!

P.Nishanth Kumar
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తుంది. అదేమిటంటే జక్కన్న ఈ సినిమా ను ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఓవైపు కరోనా, మరోవైపు ఏపీలో టిక్కెట్ల రేట్లు ఇంకోవైపు ప్రేక్షకులు థియేటర్ల లోకి రాకపోడం వంటివి రాజమౌళిని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 8వ తేదీన విడుదల కావలసి ఉంది.
కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ లేట్ కావడంతో విడుదలను అక్టోబర్ 8 కి వాయిదా వేశారు. అయితే సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లేట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా లేటయి సినిమాను అక్టోబర్ కి రెడీ చేయలేకపోయారు చిత్రబృందం. దాంతో ఇటీవలే గుమ్మడికాయ కొట్టిన కూడా ఈ చిత్రం భారీ గా వీఎఫ్ఎక్స్ పనులు ఉండటంతో విడుదలను మరొకసారి వాయిదా వేయక తప్పలేదు అని చిత్రబృందం తెలుపుతుంది. అయితే వాయిదా వేస్తే 15 రోజులో నెల రోజుల్లో వేస్తారు అనుకున్నారు కానీ ఈ సినిమాని ఒక్కసారిగా సమ్మర్ కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం అందరికీ షాక్ ఇస్తోంది.
భారీ తారాగణంతో బాహుబలి రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించిన జక్కన్న అదే స్థాయిలో సూపర్ హిట్ అందుకొని తను సాటి మరొకరు లేరని నిరూపించుకునే విధంగా ప్రయత్నాలు చేయగా ఇప్పుడు ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడం ప్రేక్షకులను నిరాశ పరచడమే కాకుండా సినిమాపై  ఉన్న పాజిటివ్ వైబ్స్ కూడా కోల్పోయేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు క్రేజ్ తగ్గకుండా ఉండటానికి ఈ చిత్ర బృందం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మరియు హాలీవుడ్ హీరోయిన్ గా ఓలివియా మోరిస్ లు నటిస్తుండగా కీలక పాత్రలలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: