రామ్ చరణ్ కొత్త లుక్ రాజమౌళికి మొదలైన టెన్షన్ !

Seetha Sailaja

రాజమౌళి సినిమాలలో నటించే హీరోలకు ఒక విచిత్రమైన కండిషన్ ఉంటుంది అంటారు. తన సినిమాలలో నటించే హీరోల లుక్ తన సినిమాలు విడుదల అయ్యేవరకు అలానే ఉండాలని జక్కన్న కోరుకుంటాడు. అయితే ఇప్పుడు రాజమౌళి కోరిక ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్న రామ్ చరణ్ విషయంలో తీరే అవకాశం కనిపించడంలేదు.

‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకుండానే రామ్ చరణ్ ‘ఆచార్య’ లో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడ విడుదల కాకుండానే శంకర్ దర్శకత్వంలో ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం అవుతోంది. ఈమూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రామ్ చరణ్ ఒక డిఫరెంట్ మీసకట్టుతో కనిపిస్తాడట.

రామ్ చరణ్ మీసకట్టు ను డిజైన్ చేసే బాధ్యత ముంబాయికి చెందిన ఒక ప్రముఖ స్టైలిస్ట్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుండి విడుదల అయ్యేవరకు ఈ మీసకట్టు లోనే ఉండమని శంకర్ చరణ్ ను కోరినట్లు టాక్. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ కు చరణ్ తన కొత్త మీసకట్టుతో రావలసిన పరిస్థితి ఉందికాని రాజమౌళి క్రియేట్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన మీసకట్టు తో చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ లో కనిపించే అవకాశం లేదు. ఇది ఒక విధంగా రాజమౌళికి ఊహించని షాక్ అనుకోవాలి.

‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఆసినిమా వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల అయ్యే అవకాశం లేకపోవడంతో అటు రామ్ చరణ్ జూనియర్ లు కొత్త సినిమాలను మొదలు పెట్టేస్తున్నారు. దీనితో వాళ్ళ లుక్ కూడ పూర్తిగా మారబోతోంది ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి ఒకవిధంగా తమ హీరోల విషయంలో రాజీపడుతున్నట్లు అనుకోవాలా అంటూ ఇండస్ట్రీలో కొందరి కామెంట్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: