ఒకే ఒక్క సినిమా.. విలనిజంతో భయపెట్టిన రానా?

praveen
సినిమాల్లో హీరోగా నటించడం కాస్త సులభమే కానీ అటు విలన్ పాత్రలో నటించడం మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే విలన్ పాత్రలో నటించేటప్పుడు పాత్రలో ఒదిగిపోయి జీవించాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా కొట్టిన చివరికి ఆ పాత్ర ప్రేక్షకులకు  కనెక్ట్ కాదు.  అందుకే దర్శక నిర్మాతలు సినిమాల్లో విలన్ లను ఎంపిక చేసే సమయంలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక ఎన్నో టెస్ట్ కట్ లు కూడా చేస్తూ ఉంటారు.  ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ ఊహించని రీతిలో విలన్గా తెర మీదికి వచ్చి ప్రేక్షకులందరినీ తన విలనిజంతో భయబ్రాంతులకు గురి చేశాడు దగ్గుబాటి వారసుడు రానా.

 లీడర్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. చూస్తే ఎంతో అమాయకుడిలాగానే కనిపించాడు..  ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అయితే అప్పుడు ఎవరూ ఊహించలేదు రానా లాంటి ఒక డీసెంట్ హీరో ఏకంగా బాహుబలి లాంటి బిగ్ ప్రాజెక్టులో.. ఒక క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడని.  ఇక రాజమౌళి అటు రాని బాహుబలి లో సెలెక్ట్ చేసి నప్పుడు ప్రభాస్ లాగా ఆరడుగుల ఎత్తు..  ఆకట్టుకునే బాడీషేప్ ఉంటుంది కాబట్టే సెలెక్ట్ చేశారు అని అనుకున్నారు.

 కానీ రాజమౌళి ఒక నటుడు ని సెలెక్ట్ చేశాడు అంటే అతనికి టాలెంట్ ఉంటే తప్ప సెలెక్ట్ చేయడు అన్న విషయాన్ని మాత్రం మరిచిపోయారు ప్రేక్షకులు. కానీ బాహుబలి సినిమా లో రానా పాత్రకు సంబంధించి ఒక్కో అప్డేట్ విడుదల చేస్తున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఈ పాత్ర పై ఆసక్తి పెరిగింది. ఇక సినిమా విడుదలైన తర్వాత రానా విలనిజం చూసి తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధుల్ని అయిపోయారు అనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలో రానా ఎంతో క్రూరమైన విలన్ పాత్రలో జీవించి నటించిన తీరు... ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు  ఇలా ఒకే ఒక్క సినిమాతో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టాడు రానా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: