వామ్మో ప్రభాస్ ... ఏంటి ఏకంగా మరొక రెండు ఫిక్స్ ... ??

GVK Writings
టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా ఎంచుకున్న సినిమాల లిస్ట్ నిజంగా అందరినీ ఎంతో ఆశ్చర్య పరుస్తోంది. బాహుబలి రెండు సినిమాల తరువాత హీరోగా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్, ఆ తరువాత సుజీత్ తీసిన సాహో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన దీనిని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. దాని అనంతరం ప్రస్తుతం మొత్తం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్, వాటి ద్వారా కూడా భారీ విజయాలు సొంతం చేసుకుంటే హీరోగా ఆయన క్రేజ్, మార్కెట్ వాల్యూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న నాలుగు సినిమాలతో పాటు త్వరలో కన్ఫర్మ్ కానున్న మరొక రెండు సినిమాలు కూడా భారీ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం అంటున్నారు. ఇక ఇటీవల రాధేశ్యామ్ మూవీ షూట్ పూర్తి చేసిన ప్రభాస్, మిగతా మూడు ప్రాజక్ట్స్ అయిన సలార్, ఆదిపురుష్, ప్రాజక్ట్ కె షూటింగ్స్ లో వరుసగా పాల్గొంటున్నారు. కాగా వీటిపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక విషయం ఏమిటంటే, అతి త్వరలో ప్రభాస్ తో మరొకసారి దర్శకధీరుడు రాజమౌళి ఒక భారీ సినిమా చేయనున్నారని, అలానే బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కూడా ప్రభాస్ కోసం హిస్టారికల్ భారీ మూవీ స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు టాక్.
కాగా వీటిలో రాజమౌళి మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు, సిద్దార్థ్ ఆనంద్ మూవీని కరణ్ జోహార్ నిర్మించనున్నట్లు సమాచారం. రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ షూట్ పూర్తి చేసి త్వరలో మహేష్ మూవీ కోసం సిద్ధం అవుతుండగా, రెండేళ్ల క్రితం హృతిక్, టైగర్ లతో వార్ మూవీ తీసిన సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం హృతిక్ దీపికా లతో ఫైటర్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి, సిద్దార్థ్ ల సినిమాల కథలని త్వరలో ప్రభాస్ వింటారని, ఒకవేళ అవి ఒకే అయితే వచ్చే ఏడాది వీటిపై ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో వామ్మో, ప్రభాస్ మరొక రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారా అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు ఆయన క్రేజ్ పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: