'పుష్ప' లో పవన్ కళ్యాణ్.. ఇక ఫ్యాన్స్ కి పునకాలే..!!

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'..ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాని  మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి లీకుల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.సినిమాకి సంబంధించి వరుసగా ఫోటోలు, వీడియోలు చాలా లీక్ అవుతున్నాయి.చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత చెప్పినా,హెచ్చరించినా కూడా ఎవరు వినడం లేదు.

చాలా తెలివిగా ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారు లీక్ రాయుళ్లు.ఇక తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన ఓ లీక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను తెగ ఆనందింపజేస్తోంది.ఇక అదే పనిలో పనిగా బన్నీ ఫ్యాన్స్ కూడా అంతే సంబరపడిపోతున్నారనుకోండి.ఇక పుష్ప సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు విడుదలైన బన్నీ లుక్స్, టీజర్స్ లో అదే కనిపించింది.అయితే తాజాగా సినిమా సెట్ లో లారీ ఉన్న ఫోటో ఒకటి లీక్ రూపంలో బయటికి వచ్చింది.ఆ లారీ ఎదురు అద్దం మీద పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ ఫోటో కనిపిస్తోంది.సాధారణంగా చాలా లారీలకు ఇలాంటి ఫోటోలు కనిపిస్తాయి.

అయితే బన్నీ నడిపే లారీ మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటం ఆసక్తికరం.అయితే మరోవైపు బన్నీ, పవన్ ల మధ్య కొన్ని విబేధాలు ఉన్నాయంటూ చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.గతంలో ఓ ఈవెంట్ లో బన్నీ అన్నమాట పట్టుకుని ఇప్పటిదాకా దాన్నే పట్టుకొని కూర్చున్నారు.ఆ తర్వాత ఓ సందర్భంలో కలిసి మాట్లాడుకున్నారు.అయినా ఇప్పటికీ ఆ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పుడు బన్నీ లారీ మీద పవన్ ఫోటో పెట్టి వాటికి చెక్ పెట్టాలని చూస్తున్నారా?లేక అనుకోకుండా అలా జరిగిందా? అనేది తెలియాలి. ఏదేమైనా పుష్ప సినిమాలో బన్నీ నడిపే లారీ పై ఇలా పవన్ ఫోటో కనిపించడం మెగా ఫ్యాన్స్ కి ఒకింత సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: