అశ్వినిదత్ తో ప్రభాస్ మూవీ .... ఆకాశమే హద్దు .... ??

GVK Writings
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన చలసాని అశ్వినీదత్ నేడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు, అలానే సినిమా ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభం అయిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఇప్పటికే అనేక సినిమాలు తీసిన అశ్వినిదత్ వాటిలో పలు సినిమాల ద్వారా బిగ్ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం ఆ బ్యానర్ పై 50వ వెంచర్ గా ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమాకి ఆయన అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తోంది. ఇక మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్న ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతుండగా ఇందులో ప్రభాస్ పాత్ర వండర్ఫుల్ గా ఉండనున్నట్లు టాక్. నిజానికి ఈ మూవీని పాన్ ఇండియా కంటే పాన్ వరల్డ్ రేంజ్ లో నిర్మిస్తున్నాం అంటూ ఇటీవల నాగ అశ్విన్ వెల్లడించారు.
హీరోగా ప్రభాస్ రేంజ్ ని, మార్కెట్ ని ఈ సినిమా మరింత ఊహించనంత స్థాయికి తీసుకెళ్తుందని, అలానే వీలైనన్ని ఎక్కువ భాషల్లో గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలానే మరీ ముఖ్యంగా ఇండియన్ సినిమా హిస్టరీ అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోందని, హాలీవుడ్ కి చెందిన ఎందరో ప్రముఖ నిపుణులు దీనికి పనిచేస్తున్నట్లు సమాచారం. ఆ విధంగా ఆకాశమే హద్దుగా ఎంతో భారీగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రాజక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ ని నిర్ణయించిన యూనిట్, దీనిని 2023 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్తున్నారు. మరి తొలిసారిగా రెబల్ స్టార్ తో ఇంత పెద్ద మూవీ చేస్తోన్న అశ్వినీదత్ దీని ద్వారా ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: