ఎన్టీయార్ శ్రీనాధ కవిసార్వభౌమ వెనక... ?

Satya

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీయార్ కి పౌరాణిక జానపద చారిత్రాత్మక చిత్రాలు అంటే తరగని మక్కువ. ఆయన అలా ప్రేమను పెంచుకుని ఎన్నో సినిమాలు తీసి తెలుగు వారికి తరగని సంపదగా అందించారు. ఆయన అలా ఎక్కువ ప్రేమను పెంచుకున్న కధ శ్రీనాధుడి జీవిత చరిత్ర.


దానిని సినిమా తీయాలని రాజకీయాలలోకి రాకముందే  ఎప్పటినుంచో అనుకుంటూ వస్తున్నారు. అయితే ఆ మూవీ ఆయన ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు పాలించి 1989 ఎన్నికల్లో ఓడిన తరువాత మాత్రమే సాధ్యపడింది. అలా 1992 ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుని 1993లో అక్టోబర్ లో రిలీజ్ అయింది. కేవలం ఇరవై లక్షలతో ఈ సినిమా తీసిన ఎన్టీయార్ కి లాభాలు పెద్దగా లాభాలు రాలేదు కానీ  నష్టం కూడా  తీసుకురాలేదు.


ఇక ఈ  మూవీ  విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. ఈ మూవీ లో అన్నీ పద్యాలే ఉన్నాయి. ఈ మూవీకి మొదట సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నది పెండ్యాల నాగేశ్వరరావు. ఆయనతో ఎపుడో 1980లలో  మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టించి నాటి గాయకుడు రామక్రిష్ణతో అన్ని పద్యాలు పాదించారు. అలా ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లకముందు తీయాలనుకున్న ఈ సినిమాకు నాడు వేరే దర్శకుడిని కూడా  అనుకున్నారు.  అది అలా ఉండగానే 1992 ప్రాంతంలో మళ్ళీ ఈ చిత్ర కధను ఎన్టీయార్ ముందుకు తెచ్చారు.


అపుడు దర్శకుడిగా అనుకున్న పేరు బాపు. బాపూతో ఈ సినిమా తీయాలనుకున్నపుడు మళ్లీ మొదటి నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ తో స్టార్ట్ చేశారు. అలా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కేవీ మహదేవన్ వచ్చి చేరారు. ఇక అన్ని పద్యాలూ కూడా సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. దీని మీద తాను బతికి ఉన్న రోజులలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయకుడు  రామ‌క్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనాధ మూవీ కొరకు  తాను పెండ్యాల మ్యూజిక్ డైరెక్షన్ లో పాడిన నలభై పద్యాలలో ఒక్కటి కూడా ఉంచలేదని ఆయన బాధపడ్డారు. అపుడు తెలిసింది ఈ మూవీ కోసం రెండు సార్లు మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయని, దర్శకులు కూడా ఇద్దరు మారారని, మొత్తానికి శ్రీనాధ కవిసార్వభౌముడు మూవీ వెనక ఇంత కధ ఉందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: