రమ్యకృష్ణ గురించి మీకు తెలియని విషయాలు..?

Anilkumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర తారగా ఓ వెలుగు వెలిగింది సీనియర్ నటి రమ్యకృష్ణ.90 ల కాలంలో  అప్పటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా పలు ప్రయోగాత్మక పాత్రలతో పాటూ నెగెటివ్ రోల్స్ లో కూడా అద్భుతమైన నటనను కనబర్చి.. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ సీనియర్ హీరోయిన్. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ..మొత్తం ఐదు భాషలలో 200 కి పైగా చిత్రాలలో నటించి.. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది రమ్యకృష్ణ.. ఇక రమ్యకృష్ణ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...!!

1. రమ్యకృష్ణ 15 సెప్టెంబర్ 1970 న జన్మించింది.ఒకప్పటి లెజెండరీ హాస్యనటుడు చో రామస్వామి రమ్యకృష్ణ కి స్వయానా మేనమామ అవుతారు.
2. రమ్యకృష్ణ హిందీ, కన్నడ, తమిళం, మలయాళం మరియు తెలుగులో 200 కి పైగా చిత్రాలలో సినిమాలు చేసింది.
3. ఆమె కూచిపూడి, భరతనాట్యం మరియు పాశ్చాత్యంతో సహా అనేక నృత్య రూపాలను నేర్చుకుంది అలాగే అనేక స్టేజ్ షోలను చేసింది.
4. 13 సంవత్సరాల వయస్సులో 'నేరం పులరంబోల్' అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 1985 లో తమిళ చిత్రం వెల్లై మనసులో కనిపించింది.
5. ఈమె మొదటి మలయాళ చిత్రం  విడుదల ఆలస్యం  అవ్వడంతో 1985 లో థియేటర్లలోకి వచ్చిన తమిళ చిత్రం వెల్లై మనసులో సినిమాతో వెండితెరపై మొదటిసారి కనిపించింది రమ్యకృష్ణ.
6. ఆమె సౌత్‌లో మాత్రమే కాదు, బాలీవుడ్‌లో కూడా చాలా సినిమాలు చేసింది. బడే మియాన్ చోటే మియాన్‌లో అమితాబ్ బచ్చన్, పరంపరలో వినోద్ ఖన్నా, ఖల్నాయక్‌లో సంజయ్ దత్, వాజూడ్‌లో నానా పటేకర్ మరియు బనారసి బాబులో గోవింద వంటి లెజెండరీ నటులతో  సినిమాలు చేసింది.
7. ఆమె 12 జూన్ 2013 న తెలుగు దర్శకుడు కృష్ణ వంశీని పెళ్లి చేసుకుంది. వారికి రిత్విక్ అనే కుమారుడు ఉన్నాడు.
8.  ఇక బాహుబలి లోశివగామి పాత్ర మొదట శ్రీదేవికి ఆఫర్ చేయబడింది కానీ ఆమె చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ని అడగడంతో, ఆ తర్వాత మేకర్స్ పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించారు.దీంతో"బాహుబలి" ఆమె సినీ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
9.సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి ఆమె అనేక ప్రశంసలు మరియు అవార్డులు అందుకుంది.వాటిని ఒకసారి పరిశీలిస్తే..
 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు:
i) 1999 లో "పడయప్ప" (తమిళ్) కొరకు ఉత్తమ నటి
ii) 2009 లో "కొంచెం ఇష్టం కాస్తం" (తెలుగు) కొరకు ఉత్తమ సహాయ నటి
iii) 2015 లో "బాహుబలి: ది బిగినింగ్" (తెలుగు) కొరకు ఉత్తమ సహాయ నటి
2 నంది అవార్డులు:
i) 1998 లో "కంటె కూతుర్నే కను" కొరకు ఉత్తమ నటి
Ii) 2009 లో "రాజు మహారాజు" కొరకు ఉత్తమ సహాయ నటి
c. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్:
i) 1999 లో "పడయప్ప" కొరకు ఉత్తమ నటి (ప్రత్యేక బహుమతి)గా ఫిల్మ్ అవార్డును అందుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: