అశ్వనీదత్ నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఫలితం ఇదే ?

VAMSI
సినిమాలంటే చాలా మందికి ఫాషన్. కొందరు అయితే సినిమాల ద్వారా డబ్బు సంపాదించడమే ధ్యాయంగా పెట్టుకుంటారు. కానీ కొందరు బ్రతికినంత కాలం సినిమా ఒక ప్రపంచంగా బ్రతుకుతారు. కనే నేడు సినిమా అంటే ఒక వ్యాపారం అయిపోయింది. సినిమా రంగంలోకి అందరూ వచ్చేస్తున్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుండి ఒక ఉద్యోగి వరకు అన్ని రంగాల నుండి సినిమా రంగానికి వస్తున్నారు. సినిమా రంగంలో చాలా విభాగాలు ఉన్న సినిమాను నడిపించేది నిర్మాతలే. వీరి దగ్గరే సినిమా స్టార్ట్ అవుతుంది. టాలీవుడ్ లో ఈ విధంగా ఎంతో మంది నిర్మాతలు వచ్చి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను నిర్మించారు. ఇందులో కొంత మంది కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా దివాళా తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అలా అతి చిన్న వయసులోనే నిర్మాతగా మారిన అశ్వనీదత్ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అశ్వనీదత్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించాడు. తాను నిర్మాతగా మారిన తర్వాతా తీసిన మొట్టమొదటి సినిమా అప్పట్లో రికార్డును సృష్టించింది. అశ్వనీదత్ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు వీరాభిమాని. అయితే అనుకోకుండా సీనియర్ ఎన్టీఆర్ తోనే సినిమా చేసే అవకాశం వచ్చింది. అలా 1975 లో అశ్వనీదత్ నిర్మాతగా మొదటి సినిమా సీనియర్ ఎన్టీఆర్ హీరోగా "ఎదురు లేని మనిషి" ని తీశాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన వాణి శ్రీ హీరోయిన్ గా నటించింది. ప్రభాకర్ రెడ్డి, కాంతారావు మరియు జగ్గయ్య ఇతర పాత్రలలో నటించి మెప్పించారు. కె బాపయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ లో విడుదలై శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఇలా తీసిన మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఈ రోజు అశ్వనీదత్ తన 61 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: