మళ్ళీ లీక్ అయిన పుష్ప ! తల పట్టుకుంటున్న నిర్మాతలు

NIKHIL VINAY
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొన్న వచ్చిన పాటల వరకు ప్రతి అప్డేట్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. బన్నీ మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వడంతో పుష్ప మీద ఆయన ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ పుష్ప కి లీక్ ల గోల మాత్రం తప్పడంలేదు. మొన్ననే పుష్పలో ఒక ఫైట్ లీక్ అవ్వడంతో జాగ్రత్త పడిన మూవీ టీం కి మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో లీక్ అయ్యి నిర్మాతలని తల పట్టుకునేల చేస్తుంది.

ఈ మద్యనే చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం కాకినాడ వెళ్లిన మూవీ టీం అక్కడ అల్లు అర్జున్ కెమెరా ముందు నటిస్తున్న  ఒక వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. మూవీ టీం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఈ లీక్స్ మాత్రం ఆగట్లేదు. దాదాపుగా 250కోట్లతో నిర్మింస్తున్న ఈ సినిమాలో నుంచి ఇలాంటి చిన్న చిన్న లీక్స్ వచ్చి సినిమా మీద ఆసక్తి ని తగ్గిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ దీనిమీద చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. ఇక  పుష్ప సినిమా ఈ చివరి షెడ్యూల్ తో మొత్తం పూర్తి ఐపోయినట్టే ఉంది. పుష్ప ని సుకుమార్ చాలా జాగ్రత్తగా తెరపైకి తీసుకొని వస్తున్నాడు.

ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రాబోతున్న పుష్ప తెలుగు ,తమిళం ,హిందీ లో కూడా విడుదల కాబోతుంది. ఇన్ని రోజులు తెలుగులో స్టైలిష్ స్టార్ గా పిలిపించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా హిట్ అయితే ఆ పెరు ఆయనకి శాశ్వతంగా ఉండిపోతుంది. అలాగే ఆయన పేరుకి తగ్గట్టుగానే ఐకాన్ సినిమా కూడా త్వరలోనే మొదలుకాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: