చిక్కుల్లో 'ఆర్.ఆర్.ఆర్'.. జక్కన్న ఏం చేస్తాడో మరి..?

Anilkumar
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'రౌద్రం, రణం, రుధిరం. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్, మేకింగ్ వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఇంకా విడుదల తేదీపై క్లారిటీ రావడం లేదు. అయితే ఈ   సినిమా మొత్తం రాజమౌళి-దానయ్య చేతుల్లోనే ఉంది.

ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది.అయితే ఇంకో నెల తిరిగే వరకు ఈ  సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది.కాబట్టి ఈ సినిమాను ఇష్టం వచ్చినప్పుడు  రిలీస్ చేస్తారని అనుకుంటున్నారు.కానీ  'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ అనేది ఇప్పుడు మేకర్స్ చేతుల్లో లేదు. పెన్ స్టూడియోస్ చేతిలో ఉందట.అయితే తాజాగా అందిన సమాచారం ఏంటంటే వారు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 'ఆర్ఆర్ఆర్' సినిమాను మరో నాలుగు నెలల్లో రిలీజ్ చేయాలట.దీనికి సంబంధించి అందరూ సంతకాలు కూడా చేశారట.అడ్వాన్స్ పేమెంట్ కూడా చేతులు మారింది. అయితే  అగ్రిమెంట్ లో చెప్పినట్లుగా చేయకపోతే..

ఆర్ఆర్ఆర్' మేకర్స్.. రివర్స్ లో పెన్ స్టూడియోస్ కు పెనాల్టీ కట్టాల్సి ఉంటుందట.లేదా ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా పెన్ స్టూడియోస్ సంస్థ కూడా.. జీగ్రూప్ కు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే పెన్ స్టూడియోస్ నుంచి భారీ మొత్తంలో 'ఆర్ఆర్ఆర్' హక్కులను జీ గ్రూప్ దక్కించుకుంది. ఇదే కాకుండా నెట్ ఫ్లిక్స్, స్టార్ మా కూడా ఈ సినిమా పై  రైట్స్ దక్కించుకున్నాయి.కాబట్టి 'ఆర్ఆర్ఆర్' సినిమాను రాబోయే నాలుగు నెలల్లో రిలీజ్ చేయకపోతే నిర్మాతలు భారీ నష్టం అనుభవించాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటె ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దొరకడం లేదు.మరి వీటి అన్నిటికి రాజమౌళి ఎం చేస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: