ర‌మ్య కృష్ణ స‌క్సెస్ మంత్ర : ఎవ‌రూ ఓడిపోరు స‌ర్!

RATNA KISHORE

ఎవ‌రూ ఓడిపోరు.. ఈ మాట ఆ దంప‌తుల జీవితంలో నిజం అయింది. ర‌మ్య‌కృష్ణ జీవితంలోనూ, డైరెక్ట‌ర్ కృష్ణవంశీ జీవితంలోనూ నిజం అయింది. కెరియ‌ర్ అయిపోయింది అన్న మాట అస్స‌లు వినిపించ‌కండి. అది అస్స‌లు న‌చ్చ‌ని పదం వారికి. పందెంలో గె లుపు ఉందో లేదో కానీ ఓట‌మి మాత్రం లేదు. త‌న‌ని తాను నిరూపించుకునే పాత్ర‌లు అన్ని వేళ‌ల్లో వ‌రించి ఉన్నాయో లేవో కానీ ఆమె మాత్రం ప్ర‌తి పాత్ర‌కూ గ్లామ‌ర్ యాడ్ చేయ‌డం ఒక్క‌టే కాదు న‌ట‌న‌కు అవ‌ధి కూడా ఇది అని చెప్పి వెళ్లారు. న‌ట‌న‌తోనే ఎ న్నో సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. అవార్డులు గెలుచుకున్నారు.  త‌లైవీ పాత్ర‌లో ఒదిగి అమ్మ‌ను మ‌ళ్లీ మ‌రిపింప‌జేశారు. ఆమె శివ‌గామి క‌న్నా నీలాంబ‌రిగానే బాగున్నారు. జ‌య‌లలిత పాత్ర‌లో ఒదిగి త‌న‌కిక  తిరుగు లేద‌ని నిరూపించారు.




బాహుబ‌లి సినిమా త‌రువాత ర‌మ్య కృష్ణ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇలా రాయ‌డం క‌న్నా ఇంకొక అవ‌మానం ఆమెకు ఉండదు. ఆ సినిమా ఉన్నా లేక‌పోయినా మంచి న‌టికి జీవితం ఎన్న‌డూ ప‌రీక్ష‌లు పెడుతూనే ఉంటుంది. ఆమెకు కూడా అలాంటి ప‌రీక్ష‌లే కెరియ‌ర్ తొలినాళ్ల‌లో వ‌చ్చాయి. వాటిని త‌న ప్ర‌తిభ‌తో అధిగ‌మించి ఒడ్డెక్కారు. జీవితంలో ఎన్నో సంద‌ర్భాలలో ఓట‌ములు ఉన్నాయి. వాటిని ఆమె త‌న తెలివితో నెగ్గుకు వ‌చ్చారు. బాహుబ‌లి ఉన్నా లేక‌పోయినా ఆమె ప్ర‌తిభ ఎక్క‌డికీ పోదు.ఆమె ఓడిపోదు. ఓడిపోయేందుకు స‌రిప‌డినంత స‌మ‌యం కూడా ఆమెకు లేదు. వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన రోజు ఒక్క‌టి ఇప్ప‌టికి లేదు. రేప‌టి వేళ ఉంటుందో లేదో తెలియ‌దు.




ఐరన్ లెగ్ అని అనుకున్న మ‌నిషి ఐరెన్ లేడీ అయ్యారు. నట‌న రాదు అన్న వారు ముక్కున వేలేసుకున్నారు. రాఘ‌వేంద్రరావు అల్లుడు గారు సినిమా లేక‌పోతే ఆమె ఇక ఇంటికే అనుకున్నారు. ఆ సినిమాతోనే అంత‌టి పేరు తెచ్చుకుని, గ‌డ్డి పువ్వుకు  కాస్త గులాబీ ప‌రిమ‌ళం అందుకున్నంత స్థాయికి చేర్చారు. చేరారు కూడా!



సినిమాల్లో రాక ముందు, సినిమాల్లోకి వ‌చ్చాక జీవితం రెండు భాగాలుగా ఉంటుంది. రెండు భాగాలుగా అతికిన‌ప్పుడు ప‌రిపూర్ణం గా క‌నిపిస్తుంది. తాను న‌టించిన సినిమాల్లో ర‌మ్య‌కృష్ణ వేరు, త‌రువాత వేరు. ఆమె ఎన్నో ఆటుపోట్లు దాటి విజ‌య తీరం వైపు చే రుకున్నారు. మంచి ఫ‌లితాలు అందుకున్నారు. సినిమాల విజ‌యంలో కీల‌కం అయ్యారు. సినిమాల‌కు గ్లామ‌ర్ ఒక్క‌టే అంతిమం కాదు అని నట‌న‌తో త‌నని తాను నిరూపించుకున్నారు. కొన్నంటే కొన్ని సంద‌ర్భాల్లో అవ‌మానాలు దాటి కొత్త దారుల వెంట ప్ర‌యా ణించి తెలుగు సినిమా రంగాన్ని కొంత కాలం శాసించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: