శ్రీముఖికి బంపర్ ఆఫర్... ఏకంగా ?

VAMSI
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంలో చెల్లెలిగా, యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నేను శైలజ సినిమాలో అక్కగా నటించిన కూడా శ్రీముఖికి రాని గుర్తింపు పటాస్ షో తో వచ్చింది. ఈ షో అందించిన ప్రేక్షక ఆదరణతో పెద్ద సెలబ్రిటీ గా మారిపోయింది శ్రీ. ఇక బిగ్ బాస్ తర్వాత ఈమె క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. బిగ్ బాస్ సీజన్ 3 లో లౌడ్ స్పీకర్ గా సందడి చేసిన శ్రీముఖి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా తన ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచేసింది ఈ భామ. ఇక ఇటీవలే శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ చిత్రం విడుదల కాగా ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇ. స‌త్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీముఖి గ్లామర్ ఓ రేంజ్ లో ఆరబోసింది. అయితే ఇపుడు ఈమె మరో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందులోనూ అది స్టార్ హీరో చిత్రమని సమాచారం. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు చెల్లిలో లేదా అక్కగానో, లేక ప్రత్యేక పాత్రలతోనో సరిపెట్టుకున్న శ్రీ ముఖి. ఈసారి ఈ స్టార్ హీరో సినిమాలో హీరోకి ఏకంగా లవర్ పాత్రలో కనిపించనుందట. అంటే దాదాపుగా సెకండ్ హీరోయిన్ పొజిషన్ అని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ క్రేజీ హీరో ఎవరు, దర్శకుడు ఎవరు...ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది అన్న వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు మరి. క్రేజీ అంకుల్స్ లో ఫుల్ గ్లామరస్ గా కనిపించిన శ్రీముఖికి ఇండస్ట్రీలో రేంజ్ మారబోతుంది అంటూ అనుకుంటున్నారు.
ఇప్పటికే రెండు మూడు సినిమాలకి సైన్ చేసినట్లు సమాచారం. ఇటు సోషల్ మీడియాలోనూ శ్రీ ముఖి తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఒక ఊపు ఊపుతోంది. అనసూయ, రేష్మీల తో సమానంగా స్టార్ హోదా ను దక్కించుకుంది శ్రీ. ఇపుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ అంతటి పాత్రతో మనముందుకు రాబోతుంది అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇది నిజమా లేదా గాసిప్ అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: