నువ్వే కావాలి సినిమా అప్పట్లో ఎన్ని కలెక్షన్స్ సాధించిందో తెలుసా...?

murali krishna
టాలీవుడ్ సినిమాలు ఇటీవల కాలంలో అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. కానీ పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందనే నమ్మకం కూడా ఒకసారి దర్శకనిర్మాతలకు కలగడం లేదని తెలుస్తుంది..ఇకపోతే ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఒక సినిమా 20 కోట్ల రూపాయలు వసూలు చేసి దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిందట.
అదికూడా కొత్త హీరో హీరోయిన్లతో ఇంతటి కలెక్షన్ల రాబట్టింది అంటే అతిశయోక్తి కాదని తెలుస్తుంది..ఇక ఆ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో కాదు నువ్వే కావాలి..ఈ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తరుణ్ నువ్వేకావాలి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా తోనే మంచి విజయం అందుకున్నాడు తరుణ్. ఈ సినిమాని రామోజీరావు ఉషా కిరణ్ మూవీ బ్యానర్ పై నిర్మించడం జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో పూర్తిచేసుకుని విడుదలైన తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిందని సమాచారం. ఈ సినిమాకి విజయభాస్కర్ దర్శకత్వం వహించినట్లు సమాచారం.
 
నువ్వేకావాలి సినిమా 2000 వ సంవత్సరంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైందట. అలా విడుదలయి ఒక సంచలనం సృష్టించిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఉత్తమ జాతీయ తెలుగు సినిమాగా అవార్డు దక్కించుకుందని సమాచారం. ఇక దీనితో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను కూడా దక్కించుకుందని సమాచారం.ఇక అదే సంవత్సరంలో నాగార్జున నటించిన ఆజాద్ సినిమా కూడా కొద్దిరోజులు ముందుగానే విడుదల అయిందని తెలుస్తుంది.ఆ సినిమా అంతంత మాత్రమే నిలిచిందని సమాచారం.
 
ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసినటువంటి సినిమా వంశీ అదే సంవత్సరంలో విడుదలైంది.ఈ సినిమా కూడా అబౌ యావరేజ్ గా నిలిచిందని సమాచారం. ఇక అదే తరుణంలో వెంకటేష్ నుండి జయం మనదేరా సినిమా విడుదలయ్యి 12 కోట్ల రూపాయల వరకు షేర్ ను కొల్లగొట్టిందని సమాచారం. కాబట్టి అప్పట్లో నువ్వేకావాలి సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని ఈ రికార్డ్స్ చూస్తేనే తెలుస్తుంది. అంతేకాకుండా అప్పట్లోనే ఈ సినిమా తెలుగు జాతీయ సినిమా గా కూడా రికార్డు సృష్టించిందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: