మెగాస్టార్ చిరంజీవిని గుర్తు పట్టని ఆ కమెడియన్ ఎవరో తెలుసా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి కమెడియన్ బాబు మోహన్ గురించి తెలియని వారంటూ ఉండరు. నటుడు బాబు మోహన్ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. చిన్న వయసులోనే ఎన్నో పాత్రలు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుతో కలిసి కామెడీ చేస్తే.. కడుపుబ్బా నవ్వని మనిషంటూ ఎవరు ఉండరు.
బాబు మోహన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. 1952 మార్చి 19న బీరోలు, తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లాలో పుట్టారు. ఇక బాబు మోహన్ కామిడి టైమింగ్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటుంది. అయితే మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు.. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
బాబు మోహన్ తెలుగులో కామిడియన్ గా, హీరోగా, సహాయ పాత్రల్లో నటించి మంచి మార్కులు వేయించుకున్నారు. అయితే బాబు మోహన్ ఖమ్మంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకి నటన మీద ఆసక్తితో చిన్నప్పుడే ఎన్నో నాటకాలు వేసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
అయితే ఆయన నటన పై ఉన్న ఇంట్రెస్ట్ తో జాబ్ కూడా వదిలేసి.. ఖాళీగా సారథి స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉండేవారంట. ఈ తరుణంలోనే అక్కడ ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. అక్కడే కూర్చున్న ఒక నటుడిని ఇలా అడిగారట. ఏంటంటే.. ఈ సినిమాలో హీరో ఎవరు అని అడిగితే.. ఇక ఎదురుగా ఉన్న ఆయన నవ్వి.. ఆ హీరో ఎవరో కాదు నేనే అని చెప్పారంట. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరంటే చిరంజీవి. ఒక్కసారిగా షాకైన బాబు మోహన్.. సారీ సార్ నన్ను క్షమించండి అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: