నాని కెరీర్ కి జెంటిల్ మెన్ మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా!!

P.Nishanth Kumar
నాని హీరోగా నటించిన చాలా సినిమాలలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించాడు. వాటిలో ఒక సినిమా జెంటిల్ మెన్. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాని ను స్టార్ హీరోగా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించి నిర్మాతలకు కాసుల పంట పండించింది ఈ సినిమా. నాని కెరియర్ కు ఇది ఎంతగానో బూస్ట్ అవ్వగా నాని పై పూర్తిస్థాయి నమ్మకం ఏర్పరిచే సినిమా గా అయ్యిందని చెప్పవచ్చు.
ఈ సినిమాలో నాని కొంత నెగటివ్ షేడ్ లో కనిపించగా అదే సినిమా కి ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. తొలిసారి ఆయన ఇలాంటి పాత్ర పోషించాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా గా చేసి ప్రేక్షకులకు మెప్పించి ఈ చిత్రం భారీ సక్సెస్ అయింది. నివేదా థామస్, సురభి లు హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా తో వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. కొన్ని గొడవల కారణంగా ఇద్దరు నాని లలో ఒక నాని చనిపోగా అతని స్థానంలో మరొక నాని వచ్చి ఆయన ప్రియురాలిని సంతోషపడుతూ, వ్యాపార వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తన కొడుకు చనిపోయాడు అనుకుంటున్న మరో నాని తల్లి మరియు అతని ప్రియురాలికి అసలు విషయం తెలుసుకొని హీరో నీ సమర్ధిస్తూ ఉంటారు.
నిజానికి నాని చనిపోవడానికి గల కారణం ఏమిటి.. అనే కోణంలో మరో హీరో అన్వేషిస్తూ ఈ సినిమా కొన్ని ఆసక్తికరమైన విషయాలతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఎంతో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో అద్భుతమైన కథతో నాని రెండు పాత్రలో మంచి వేరియేషన్స్ చూపిస్తూ ఈ సినిమాలో నటించి మరొకసారి తన నటనకు సాటిలేదని నిరూపించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఆయన తన టక్ జగదీష్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా మరొక రెండు సినిమాలను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అన్న టాక్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: