పోనీ టేల్ హెయిర్ స్టైల్ లో మెప్పించిన హీరోలు వీళ్ళే..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలందరూ సినిమా సినిమాకి కొత్తకొత్త వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. వారికి లుక్స్ లో కూడా ఎన్నో మార్పులు ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాదు.. పాత్రకు తగిన విధంగా మారడం కోసం ట్రెండ్ కు తగిన విధంగా తమ లుక్స్ ను చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే హెయిర్ స్టెయిల్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు ఇస్తున్న ప్రాధాన్యత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు రణవీర్ సింగ్ గెస్ట్ గా హాజరైయ్యారు. ఇక పోనీ టేల్ హెయిర్ స్టైల్ తో రణవీర్ వార్తల్లో ఎక్కారు. అంతేకాదు.. హిందీలో అపరిచితుడు సినిమా రీమేక్ కానుండగా ఆ సినిమా కోసమే రణవీర్ సింగ్ క్రాఫ్ పెంచినట్టు తెలుస్తుంది. అయితే రణవీర్ సింగ్ ను కొంతమంది స్టైల్ కా బాప్ అని పిలుస్తుండటం గమనార్హం అని చెప్పాలి. అలాగే కన్నడ హీరోలలో ఒకరైన ఉపేంద్ర సైతం సినిమా సినిమాకు లుక్ లో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఉప్పి 2 అనే సినిమాలో ఉపేంద్ర మూడు పిలకలతో కనిపించి అందరికి ఆశ్చర్యాన్నికి గురిచేశారు.
ఇక స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్ ను మగధీర, గోవిందుడు అందరివాడేలే  సినిమాలో పోనీటేల్ హెయిర్ స్టైల్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు. పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫోటోలలో పోనీటేల్ లో కనిపించారు. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగలో నాచోరే నాచోరే పాటలో ఎన్టీఆర్ పోనీటేల్ లో కనిపించారు. అలాగే.. బద్రీనాథ్ సినిమాలో బన్నీ, హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ పోనీ టేల్ లో కనువిందు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: