హ్యాపీ బ‌ర్త్ డే ర‌మ్య‌కృష్ణ : న‌చ్చిన నీలాంబ‌రి త‌ను!

RATNA KISHORE
జీవితంలో చీక‌టి నుంచి వెలుగులోకి వ‌స్తారు కొంద‌రు.. ఆ వెలుగు ఎంతో కాలం ఉంటుంది. వారికి పేరు తీసుకు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న అన్ని చెడు మాట‌లూ తొల‌గి గొప్ప వైభ‌వం ఒక‌టి తెర‌పైకి వ‌స్తుంది. ఆ.. వైభ‌వంలో ఆమె ఉన్నారు..ఇప్పుడు ఉన్నా రు..ఇక‌పై కూడా  ఉంటారు. పుట్టిన్రోజున శుభాకాంక్ష‌లు మీకు..ర‌మ్య‌కృష్ణ  గారూ!

ర‌జ‌నీ స‌ర్ ఎదురుగా ఉన్నారు.. నేను కాలెత్తి ఆయ‌న ఎదురుగా కూర్చోవ‌డం ఏం బాగుంటుంది. అమ్మో చాలా త‌ప్పు నేను ఆ త‌ప్పు చేయ‌ను. అభిమానులు ఒప్పుకోరు..అని అన్నారు ర‌మ్య కృష్ణ‌(న్). లేదండి ఇది పాత్ర..మీరు దీనికి న్యాయం చేయాలి.. న్యాయం చేయ‌గ‌ల‌రు కూడా! కాస్త ప్ర‌య‌త్నించండి.. మ‌న‌సు ఉంచండి.. ఏం కాదు నా పై న‌మ్మ‌కం ఉంచండి అని చెప్పారు ర‌జ‌నీ..


క‌ట్ చేస్తే సినిమా పెద్ద హిట్ .. నీలాంబ‌రి కొన్నేళ్లుగా ప్రేమ‌పూర్వ‌కంగానే ప్రేక్ష‌కుల మ‌దిలో ఉండిపోయారు. పాత్ర‌కు ఉన్న డార్క్ షేడ్స్ ఎంద‌రికో న‌చ్చేశాయి.. ఆమె అభినయం అయితే ఇప్ప‌టికీ గుర్తుండిపోయింది చాలా మందికి. త‌రువాత ర‌జ‌నీ ఆమెను ఎంత మెచ్చుకున్నారో... అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు.. ద‌టీజ్ ర‌మ్య కృష్ణ..

ఒక పిరియాడిక‌ల్ టైం అది..మీరు మాట్లాడ‌కూడ‌దు జ‌స్ట్ ఆ చీక‌టి గ‌దిలో ఉండిపోవాలి.. ఉండిపోతారు కూడా! అంత‌కుమునుపు మీరు య‌వ్వ‌న‌వ‌తిగా ఉన్న‌ప్పుడు న‌ర‌సింహ ప్రేమ‌లో ఉంటారు. ఆయ‌న‌ను సొంతం చేసుకునేందుకు ఎంత‌గానో ప‌రిత‌పిస్తారు.  ఆయ‌న మీ సొంతం కారు. ఈ గ‌మ‌నంలో మీరు త‌రువాత ఒంట‌రి అయిపోతారు. అహం బాగా నిండిన పాత్ర ఇది. మీరు చేయాలి..ఇదీ డైరెక్ట‌ర్  చెప్పిన మాట. విని న‌వ్వి ఊరుకున్నారు.. ర‌జనీ స‌ర్ కూడా ఎంతో ఒప్పించారు. నీలాంబ‌రి  పాత్ర‌లోఆమె ఒదిగి ఎది గారు.. అహం భావం అంతటా నింపుకుని త‌న దైన శైలిలో రాణించారు. ఇలా ఎన్నో ఆమె జీవితంలో! చెప్పానుగా ర‌జనీనే ఫిదా అయిపోయారు అని!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: