హ్యాపీ బ‌ర్త్ డే ర‌మ్య కృష్ణ : అలా మొద‌లైంది .. ఆమె జీవితాన్నే మార్చారు

RATNA KISHORE
ఏడు కొండ‌ల ఎంక‌న్న దీవెన అందుకున్నాక వ‌చ్చిన ఆనందం ఆమె జీవితం.. నీలాల క‌న్నుల‌కు నిత్య‌మ‌ల్లె పూల జోల అని రా యాలి.. రాశాడు కూడా క‌వి.. అలాంటి పాట‌ల‌కు ఆమె జీవం పోశారు. గోదావ‌రి తీరాల‌లో న‌డ‌యాడి సినిమా స్థాయి పెంచి మ‌న‌ల ను అల‌రించారు. మీకు బాహుబ‌లి ఒక్క‌టే ఆమెకు ఎన్నో బాహుబ‌లి లాంటి సినిమాలు.. ఆమె గొప్ప న‌ట‌న‌కు తార్కాణం.


ఒక్కొక్క‌రూ ఒక్కొక్క‌రి జీవితాన్ని ప్ర‌భావితం చేస్తారు. ఒక‌రి జీవితాన్ని మ‌లుపు తిప్ప‌డంలో ఉండే ఆనందం అడిగి చూడండి ర మ్య కృష్ణ ఏం చెబుతారో..త‌నను ఐర‌న్ లెగ్ అన్నారు ఇండ‌స్ట్రీలో న‌వ్వి పోయారు చాలా మంది.. అటుపై ఎన్ని విజ‌యాలు ఆమె ను వ‌రించాయి.. ఆమె స్థాయిని పెంచాయి..మ‌నం అనుకున్నంత మ‌నుషులు ఎందుకు ఉంటారు.. మార్పు కోరి ఉంటారు.. మా ర్పు చెందుతూ ఉంటారు. ఆ కోవ‌లో ర‌మ్య ఉన్నారు ఆ తోవ‌లో ఆమెతో జీవితం పంచుకున్న చిన్న వంశీ ఉన్నాడు వాడేలే కృష్ణ వంశీ ఉన్నాడు. ఇవాళ మీకు పుట్టిన్రోజు శుభాకాంక్ష‌లు .. స‌ర్ లైఫ్ లో ఎవ్వ‌రూ ఓడిపోరు అనేందుకు మీ ఇద్ద‌రి జీవితాలే మా అం ద‌రికీ ఆద‌ర్శం.

ఆడాళ్లా మ‌న‌దగ్గ‌ర ఎందుకు వ‌ద్దు.. అన్నాడు కృష్ణ వంశీ..నేను చెబుతున్నాను నువ్వు పెట్టుకో మంచి అమ్మాయి క‌ష్ట‌ప‌డి ప‌నిచే స్తుంది అని చెప్పారు ర‌మ్య కృష్ణ‌.. అక్క‌డి నుంచి గొడ‌వ మొద‌లైంది. అలా ఆమె జీవితమే మారిపోయింది. ఆ డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి. త‌రువాత కాలంలో సెగ డైరెక్ట‌ర్ అంజ‌నీ కూడా ఆయ‌న ద‌గ్గ‌రే ప‌నిచేశారు. త‌న‌ ద‌గ్గర జెండ‌ర్ ప‌ట్టింపులు ఉండ‌వు కానీ వీళ్లెందుకు నాకు అని మాత్రం ఆ రోజు అనుకున్నారు కృష్ణ‌వంశీ. అలా ఆ రోజు  ఆమె పాఠాలు నేర్చుకున్నారు. కృష్ణ వంశీ ప్ర‌భావం లేకుండా నే సినిమాలు తీశారు..విజ‌యాలు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ర‌మ్య‌కృష్ణ పై నా మాట ఏనాడూ చెల్ల‌దు అని కూడా అంటా రు కృష్ణ వంశీ న‌వ్వుతూ.. స‌ర్ ! భ‌ర్త అంటే ఎవ‌రు అని అడిగి చూడండి .. త‌డ‌బ‌డ‌కుండా ర‌మ్య‌కృష్ణ‌ను భ‌రించేవాడు అని చెబు తాడు.


ఇన్నేళ్ల కెరియ‌ర్ కు రాఘ‌వేంద్ర రావే ప్రాణం పోశారు. జోలాజో అమ్మ జోలా పాట‌తో విశ్వ‌నాధ్ ప్రాణం పోశారు. ఇలా ఎన్నో ఎంద‌రో ఆమె జీవితాన్ని మ‌లుపు తిప్పారు. ఇప్పుడు అంతా చెప్పే శివ‌గామి కాదు ఆమె న‌ట విశ్వ‌రూపం తెలియాలంటే ఎన్నో సినిమా లు ఉన్నాయి చూడండి ఓ సారి క్వీన్ వెబ్ సిరీస్ ను.  గౌత‌మ్ మీనన్ ఎంత బాగా ఆమెను తీర్చిదిద్దారో..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: